కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లినా.. న్యాయం మావైపే ఉంది

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి కనిపించడం లేదా..?

నీటి సమస్యంతా చంద్రబాబే వల్లే వచ్చింది

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) పక్షపాతంగా వ్యవహరిస్తోందని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం, కేఆర్‌ఎంబీ వద్ద ఏపీ వాదనలు వినిపిస్తున్నామన్నారు. కేఆర్‌ఎంబీ మీటింగ్‌ వదిలి కేసీఆర్‌ ఢిల్లీ వెళ్తే ఏమవుతుందని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లినా.. న్యాయం ఏపీ వైపే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయబద్ధంగా దక్కాల్సిన హక్కు కోసం తాము కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. విద్యుత్‌ పేరుతో అక్రమంగా నీటిని వృథా చేస్తున్నారని దుయ్యబట్టారు. 

కృష్ణా జలాల్లో తెలంగాణ సగం వాటా అడగటం అసంబద్ధమని సజ్జల అన్నారు. విభజన జరిగినప్పుడే ఎవరి వాటా ఏంటనేది నిర్ణయించారని గుర్తుచేశారు.  సమస్యంతా చంద్రబాబు వల్లే వచ్చిందని, చంద్రబాబు ఆరోజు తెలంగాణ ప్రాజెక్టులపై మాట్లాడి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చిన బాబు ఇప్పుడు సీఎం వైయస్‌ జగన్‌ను విమర్శించడం అర్ధరహితమన్నారు. చంద్రబాబుకు కృష్ణా జలాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 
 

Back to Top