చంద్రబాబు పాల‌న‌లో ప్రజాస్వామ్యం ఖునీ

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి 
 

హైద‌రాబాద్‌:  చంద్ర‌బాబు పాల‌న‌లో రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం ఖూనీ అవుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. అధికారుల బ‌దిలీల విష‌యంలో హైకోర్టు తీర్పును ఆయ‌న స్వాగ‌తించారు. ఈ సంద‌ర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం కూడా నా చెప్పు చేతుల్లోనే నడవాలని చంద్రబాబు  భావిస్తున్నారని మండిప‌డ్డారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు అని అభిప్రాయ‌ప‌డ్డారు. శ్రీ‌కాకుళం లో పోలీస్ లే డబ్బు పంచుతూ దొరికిపోయారన్నారు. పోస్టల్ బ్యాలెట్ లు అన్నీ వారికే అప్ప చెప్పాలని అంటున్నారని వార్తలు వస్తున్నాయి. దానిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామ‌న్నారు. ఓటర్ల లో ఆయోమయానికి గురి చేసేందుకు ఫ్యాన్౼హెలికాఫ్టర్ గుర్తులు మారినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఎన్నికల సంఘం అంటే లెక్కలేదని ధ్వ‌జ‌మెత్తారు.  చంద్రబాబు ఈ తీర్పు తో నైనా  ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని సూచించారు.  మా పార్టీ పేరుతో దొంగ లెటర్ హెడ్ సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, దీంతో పాటు వైయ‌స్ జగన్ పేరుతో డూప్లికేట్ ట్విట్టర్ అకౌంట్ లు సృష్టించి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  చంద్ర బాబు రాక్షస పాలన పై ప్రజలు తీర్పు ఇవ్వ బోతున్నార‌ని ఆయ‌న చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top