వైయ‌స్ జగన్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు

చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తం.. తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే 

 వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లక్ష్మీపార్వతి

హైద‌రాబాద్‌:  ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని,  వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ల‌క్ష్మీపార్వ‌తి పేర్కొన్నారు.  అన్ని ఛానళ్ల సర్వేలు వైయ‌స్ జగన్ కే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. వైయ‌స్ జగన్ సీఎం కాబోతున్నారని... అది చూసి చంద్రబాబు కుమిలిపోతారని అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తమయిందని చెప్పారు. తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని అన్నారు. ఈ నెల 19న విడుదల కానున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని... సినిమాను సినిమాలానే చూడాలని... అలా కాకుండా తమను ఇబ్బందికి గురి చేస్తే, న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

తాజా ఫోటోలు

Back to Top