నాయిబ్రాహ్మణులకు త్వరలో చట్టసభలలో స్దానం

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర  కార్యాల‌యంలో నాయిబ్రాహ్మణ కృతజ్ఞతాసభ.

చంద్రబాబు హయాంలో  సమస్యలు చెప్పుకుంటే అవి తీర్చకపోగా నాయిబ్రాహ్మణులను అవమానించారు

నాయీబ్రాహ్మణులంటే దేవాలయాలలో సేవకులే కాదు పాలకులనేలా శ్రీ వైయస్ జగన్ నిర్ణయాలు

రానున్న ఎన్నికలలో ప్రతి నాయీబ్రాహ్మణ కుటుంబం ముఖ్యమంత్రి  వైయస్ జగన్ గారికి అండగా ఉంటుంది

సంక్షేమపధకాలు అమలు చేసి, మీకు నచ్చితేనే నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పగలిగే ధీశాలి వైయ‌స్ జగన్ 

సమాజంలో గౌరవ ప్రతిష్టలు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనే అని స్పష్టం చేసిన నాయీ బ్రాహ్మణులు.

హాజరైన రాష్ట్ర మంత్రులు  జోగిరమేష్, కొట్టు సత్యన్నారాయణ, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
ప్రభుత్వ సలహాదారులు (ప్రజావ్యవహారాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి.

తాడేప‌ల్లి: నాయిబ్రాహ్మణులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త్వరలో చట్టసభలలో స్దానం క‌ల్పిస్తార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర  కార్యాల‌యంలో నాయిబ్రాహ్మణ కృతజ్ఞతాసభ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  వైయస్ జగన్ 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసే సమయంలో అనేక ప్రాంతాలలో నాయీబ్రాహ్మణులు కలిశారు.వారి సాధకబాధకాలు ఆయనకు చెప్పుకున్నారు. వాటన్నింటిని గుర్తించుకున్న శ్రీ వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వచ్చారు.చంద్రబాబు దగ్గరకు సమస్యల పరిష్కారం కోసం వెళ్తే తమ తోకలు కత్తిరిస్తానంటూ బెదిరించి హేళనగా మాట్లాడిన విషయాన్ని మరిచిపోలేని నాయిబ్రాహ్మణులు శ్రీ వైయస్ జగన్ తమ పట్ల చూపుతున్న ఆదరాభిమానాలతో వారు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జగనన్న చేదోడు ద్వారా రాష్ర్టంలోని వృత్తిదారులైన నాయీబ్రాహ్మణులకు ఇప్పటికీ మూడు సార్లు పదివేల చొప్పున అంటే 30 వేల రూపాయలు వారి అకౌంట్లలో వేశారు.వృత్తిదారులకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు.

నాయీబ్రాహ్మణులను కించపరిచే పదాలను నిషేధిస్తూ అలా అవమానిస్తూ  మాట్లాడిన వారి ని జైలుకు పంపేలా జిఓ నెంబర్ 50 జారీ చేశారు.

రాష్ర్టంలోని పలు దేవాలయాలలో పనిచేసే నాయిబ్రాహ్మణులకు 20,000 వేల రూపాయల వేతనం అందేలా అవసరమైతే తలనీలాల వేలం ద్వారా వచ్చే మొత్తాన్నుంచి వారికి అందేలా,తలనీలాల టిక్కెట్ల రేట్లను సైతం 25 రూపాయల నుంచి 40 రూపాయలకు పెంచారు.దీనికి సంబంధించి జిఓ నెంబర్ 110 విడుదల చేశారు.

నాయిబ్రాహ్మణులకు పాలకమండళ్ళలో స్దానం కల్పిస్తూ గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకువచ్చారు.

      ఈ నేపద్యంలో సీఎం శ్రీవైయస్  జగన్ కు ఎప్పటికీ అండగా నిలుస్తామని నాయీ బ్రాహ్మణులు స్పష్టం చేశారు. తమకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనేని వారు తేల్చి చెప్పారు. జయహో జగనన్నా అంటూ తాడేపల్లిలో నిర్వహించిన సభలో నినదించారు. రాష్ర్టంలోని నాయిబ్రాహ్మణ సంఘాలన్నీ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయాలనే ఉధ్దేశ్యంతో మంగళవారం నాడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రాష్ర్టంలోని అన్ని జిల్లాలనుంచి నాయిబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు వేలాది మంది తరలివచ్చారు. పార్టీ లోని అగ్రనేతలను,మంత్రులను కలసి తమ కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా జరిగిన నాయీబ్రాహ్మణ కృతజ్ఞతా సభకు రాష్ర్ట మంత్రులు శ్రీ జోగిరమేష్,శ్రీ కొట్టు సత్యన్నారాయణ,శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ,ప్రభుత్వ సలహాదారులు (ప్రజావ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల రాష్ర్ట కోఆర్డినేటర్ శ్రీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు. తొలుత దివంగత నేత శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి,జ్యోతిరావుపూలే,ధన్వంతరీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

      ఈ సందర్బంగా నాయీబ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్  సిధ్దవటం యానాదయ్య మాట్లాడుతూ నాయీబ్రాహ్మణులంటే సమాజానికి సేవకులే కాదు పాలకులని నిరూపించేలా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు చేశారని  తెలియచేశారు. చంద్రబాబు హయాంలో ఆయన దగ్గరకు సమస్యలు చెప్పుకుంటే అవి తీర్చకపోగా నాయిబ్రాహ్మణులను అవమానించారన్నారు. దేశంలో బిసిలు,నాయిబ్రాహ్మణులు ముఖ్యమంత్రులుగా పరిపాలించిన రాష్ట్రాల్లో చేయలేని విధంగా శ్రీ వైయస్ జగన్ గారు తమను ఆదరిస్తున్నారన్నారు. అనేక వందలమంది నాయిబ్రాహ్మణులకు నామినేటెడ్ పదవులు ఇచ్చి,నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ పధకాలు అందించి మా కుటుంబాలలో వెలుగులు నింపిన వ్యక్తి శ్రీ వైయస్ జగన్ అని కొనియాడారు.ఇందుకు శ్రీ వైయస్ జగన్ గారికి నాయిబ్రాహ్మణ సమాజం రుణపడి ఉంటుందని,రానున్న ఎన్నికలలో సైతం ప్రతి నాయిబ్రాహ్మణుడు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ కు అండగా ఉంటారని తెలియచేశారు.

         గృహనిర్మాణ శాఖమంత్రి  జోగిరమేష్ మాట్లాడుతూ నాయీబ్రాహ్మణులు గర్వపడేలా, తలెత్తుకుని తిరిగేలా నిర్ణయాలు అమలు చేసిన వ్యక్తి శ్రీ వైయస్ జగన్ అని అన్నారు.75 సంవత్సరాల చరిత్రలో ఆ విధంగా చేయగల దమ్ము,ధైర్యం ఒక్క సిఎం శ్రీ వైయస్ జగన్ గారికే ఉందన్నారు.ఇదే రీతిలో నాయీబ్రహ్మణులు కోరుకుంటున్న విధంగా అసెంబ్లీలో,శాసనమండలిలో వారిని అడుగుపెట్టేంచేలా చేయగల సత్తా శ్రీ వైయస్ జగన్ గారికి ఉందని అది త్వరలోనే నెరవేరుతుందన్నారు.బిసిలుగా ఎన్నికులాలు ఉన్నాయో కూడా బిసి సోదరులకు తెలియదని శ్రీ వైయస్ జగన్ తన 3,648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా 139 బిసి కులాల వారితో మాట్లాడి ఆయా కులాల అభ్యున్నతికి ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు చేేశారన్ననారు.అదే విధంగా తన క్యాబినెట్ లో బిసి,ఎస్సి,ఎస్టి,మైనారిటీ వర్గాలకు 17 మందిని మంత్రులుగా చేసి సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ఘనత శ్రీ వైయస్ జగన్ గారిదన్నారు.చంద్రబాబుకు ఎన్నికల సమయంలో మాత్రమే బిసిలు గుర్తుకు వచ్చేవారన్నారు.పైగా వారు కులవృత్తులలో కొనసాగేలా కత్తెర్లు,ఇస్త్రీపెట్టెలు వంటివి అందించేవారన్నారు.వారి సమస్యలు పరిష్కారంచకుండా వారిని అవమానించారన్నారు.అదే వైయస్ రాజశేఖరరెడ్డిగారి ఫీజు రీయంబర్స్ మెంట్ వల్ల బిసిల కుటుంబాలలోని పిల్లలు నేడు విదేశాలలో ఉపాది,ఉద్యోగాలు పొందారన్నారు.నేడు శ్రీ వైఎస్ జగన్ విద్యా దీవెన,వసతి దీవెన,విదేశీ విద్య పథకాలు ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు.

       రాష్ర్ట దేవాదాయ శాఖమంత్రి  కొట్టు సత్యన్నారాయణ మాట్లాడుతూ....నాయీ బ్రాహ్మణుల పట్ల చంద్రబాబు చాలానిర్దయగా,నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారన్నారు.ఆనాటి దారుణాన్ని నాయీబ్రాహ్మణులు ఎన్నిటికి మరిచిపోలేరన్నారు.అది వారి మనస్సులను గాయపరిచిందన్నారు.అవే సమస్యలను పాదయాత్ర సమయంలో శ్రీ వైయస్ జగన్ గారిని నాయీబ్రాహ్మణులను కలిసి చెప్పుకుంటే ఆయన స్పందించిన తీరు నేడు అధికారంలోకి వచ్చాక వారికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నపరిస్దితి ప్రతి నాయీబ్రాహ్మణుడి హృదయాలలో చిరస్దాయిగా నిలిచిపోతుందన్నారు.అందుకే నేడు నాయీబ్రాహ్మణులంతా తరలివచ్చి శ్రీ వైయస్ జగన్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారని వివరించారు.మాట ఇచ్చారంటే శ్రీ వైయస్ జగన్ గారు నెరవేర్చితీరుతారనే నానుడు నిజం చేసారన్నారు.సిఎం గారు ఇచ్చిన మాటను ఏ విధంగా నెరవేర్చారో అదే రీతిలో నాయీబ్రాహ్మణులందరూ వారి మాటపై నిలబడి వచ్చే ఎన్నికలలో శ్రీ వైయస్ జగన్ గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని కోరారు.నాయీబ్రాహ్మణులకు సంబంధించి పలు జిఓల జారీలో తనకు భాగస్వామ్యం చేసిన శ్రీ వైయస్ జగన్ గారికి కృతజ్ఞతలు తెలియచేశారు.

         రాష్ర్ట సమాచార,బిసి సంక్షేమశాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ....  రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉన్నాయని ఆ బిసి కులాలన్నింటికి కార్పొరేషన్ లు‌ ఏర్పాటుచేసి శ్రీ వైయస్ జగన్  అందరికీ  న్యాయం చేస్తున్నారని అన్నారు. సమాజంలో నాయీ బ్రాహ్మణుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని,వారి సహకారం లేకుండా ఏ పనీ చేయలేమని అన్నారు. రాజకీయాలను చూస్తే ఎంతో కాలంగా చాలామంది నేతలు  నాయీబ్రాహ్మణుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారని అన్నారు.తొలుత వైయస్సార్ నేడు శ్రీ వైయస్ జగన్ లు మాత్రమే వారిని ఆదరిస్తున్నారని తెలియచేశారు. బీసీలకు ఏం చేశారని లోకేష్ నన్ను ప్రశ్నించారని అయితే లోకేష్ కు చెబుతున్నామని ఇలా నన్ను అడగటం కాదు..రాష్ర్టంలో  ఏ బీసీని అడిగినా శ్రీ వైయస్ జగన్ హయాంలో వారికి జరిగిన మేలు గురించి చెప్తారని అన్నారు. 1992లో సంస్కరణలు వచ్చినప్పుడు కేవలం కొన్ని వర్గాలు మాత్రమే ఆ ఫలాలు అందుకున్నాయని 14 ఏళ్ల తర్వాత వైయస్సార్ వచ్చాకనే బీసీల పిల్లలు పెద్ద చదువులు చదవగలిగారని తెలియచేశారు. గతంలో చేనేత, గీత కార్మికుల ఆత్మహత్యలు ఉండేవని అవి నేడు ఎందుకు లేవో అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలని కోరారు. శ్రీ వైయస్ జగన్ పాలన, సంక్షేమ పథకాల ప్రభావం‌ వల్ల అవి తగ్గిపోయాయని తెలియచేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు అగ్రవర్ణాలలోని పేదలు శ్రీ వైయస్  జగన్ పాలనలో ప్రశాంతంగా బతుకుతున్నారు. ఈ వర్గాలంతా కూడా శ్రీ వైయస్ జగన్  రాష్ర్టానికి మరింత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నారని తెలిపారు.

        పేదల కష్టాలను పరిష్కరించే విధంగా  సంక్షేమపధకాలు అమలు చేసి, మీకు నచ్చితేనే నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పగలిగే ధైర్యం ఉన్న వ్యక్తి  ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మాత్రమేనని  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు(ప్రజావ్యవహారాలు), పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.రానున్న ఎన్నికలలోలబ్దిదారులే ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ లుగా మారాలని కోరారు. నాయిీబ్రాహ్మణులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు శ్రీ వైయస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని,వారు కూడా నాయకుడు అందిస్తున్నవాటిని అందిపుచ్చుకోవాలని కోరారు.దేవాలయాల పాలకమండళ్లలో నాయీబ్రాహ్మణులకు ఖచ్చితంగా స్ధానం కల్పించడం వల్ల 1100 కు పైగా దేవాలయాల పాలక మండళ్ళల్లో నాయీ బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం రానుందని అన్నారు.దీని వల్ల నాయీ బ్రాహ్మణులలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని తెలియచేశారు.నాయీబ్రాహ్మణులు ఆశించిన విధంగా త్వరలో ఎమ్మెల్సీ పదవి కూడా నాయీ బ్రాహ్మణులకు వస్తుందని వివరించారు. నాయీ బ్రాహ్మణ సోదరీమణుల హాజరు మరింత పెరగాలని శ్రీ వైయస్ జగన్ మహిళా సాధికారిత దిశగా అందిస్తున్న అవకాశాలను వారు అందిపుచ్చుకోవాలని కోరారు. ప్రజలను నమ్ముకున్న నాయకుడు జగన్.పోరాటాల్లో రాటుదేలిన వ్యక్తి శ్రీ వైయస్ జగన్ అని అంటూ చంద్రబాబు చీకటికి, శ్రీ వైయస్ జగన్ వెలుతురుకు ప్రతినిధులన్నారు.చీమలు పెట్టిన పుట్టలో పాము వెళ్ళినట్లు ఎన్టీఆర్ పెట్టిన పార్టీని చంద్రబాబు కబ్జా చేశాడు.నేడు వ్యవస్థలను మేనేజ్ చేయటం ద్వారా బతుకుతున్నాడు. అబద్దం చెప్పకుండా చంద్రబాబు బతకలేడు....కామన్ సెన్స్ కు, ప్రజలకు సంబంధం లేని నాయకుడు చంద్రబాబుని మండిపడ్డారు.  చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. బోయలు పల్లకి మోసినట్లు చంద్రబాబును ఎవరో ఒకరు మోయాలని వివరించారు. చంద్రబాబు తన 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అవినీతి ద్వారా లక్షల కోట్లు ఆర్జించాడని తెలిపారు.చంద్రబాబు హయాంలో జరిగేదంతా నీచ రాజకీయమేనని మీడియాని అడ్డం పెట్టుకుని కావాల్సిన రీతిలో వార్తకు రాయించుకునే తత్వం చంద్రబాబుదని విమర్సించారు.

         రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు అవకాశం ఇస్తే పేదల గురించి పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. శ్రీ వైయస్ జగన్ చేసిన దాంట్లో 00.1 శాతం అన్నా చంద్రబాబు చేసి ఉంటే కనీసం ఇవాళ చెప్పుకోవటానికి అయినా అర్హత ఉండేదని అన్నారు. ఒకసారి మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడని,1999లో వాజ్ పేయి భుజాలు ఎక్కి అధికారంలోకి వచ్చాడని 2014లో కూడా ఊతకర్రలతోనే  చంద్రబాబు వచ్చాడని విమర్శించారు. నరేంద్రమోడీ, పవన్ కళ్యాణ్ మోస్తే వంద సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడని తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కేవలం ఐదేళ్ళల్లో ఎలా కోట్లాది మంది హృదయాల్లో ఎలా ఉండగలిగారో తెలుసుకుంటే చంద్రబాబుకు బాగుండేదన్నారు. ఇక అవినీతి విషయానికి వస్తే చంద్రబాబు మరుగు దొడ్లను కూడా మింగేశాడు...అన్నా క్యాంటీన్ లలోనూ అవినీతే...టిడ్కో ఇళ్ళ బరువు అంతా లబ్దిదారులపై పెట్టాడని అన్నారు.చంద్రబాబు హయాంలో ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలను పూర్తిగా మూలన పడేశారని,శ్రీ వైయస్ జగన్ వచ్చిన తర్వాత ఈ రెండు కీలక పథకాలను మళ్లీ గాడిన  పెట్టారని తెలియచేశారు. నారావారి పల్లెలో చంద్రబాబు తాను చదివిన స్కూల్ నే పట్టించుకోలేదు. శ్రీ వైయస్ జగన్ అధిుకారం చేపట్టాక నాడు-నేడు తో కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేశారన్నారు. ఎన్నికలు రానున్న తరుణంలో  ఈ సంవత్సరం అంతా చంద్రబాబు,  ఆయనకు మద్దతు ఇచ్చే పచ్చమీడియా అబధ్దాలు,కుయుక్తులు,కుట్రలతో దుష్ర్రచారం చేస్తారని వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

      అన్నింట్లో సమానత్వం రావటమే ప్రజాస్వామిక స్ఫూర్తి అని మన దేశంలో కులం అనే రోగం కనిపిస్తుంది.  ప్రపంచంలో చూసినట్లయితే ఎక్కడా కుల సమస్య లేదని అన్నారు. ప్రపంచ పౌరులుగా మన బిడ్డలు నిలబడాలనే దిశగా కుల వివక్షను దూరం చేయటంలో రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరణలో చేసి చూపించిన వ్యక్తి శ్రీ వైయస్ జగన్ అని అన్నారు. నిత్య విద్యార్ధిలా ప్రతి క్షణం ఎక్కువ మంది పేదలకు ఎక్కువ ప్రయోజనం కలిగించటం కోసమే శ్రీ వైయస్ జగన్ కృషి  చేస్తుంటారు...పేద వర్గాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్లు నిలబడే విధంగా చేయటమే శ్రీ వైయస్  జగన్ లక్ష్యం అని వివరించారు.

       పార్టీ అనుబంధ సంఘాల రాష్ర్ట కోఆర్డినేటర్ శ్రీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ..శ్రీ వైయస్ జగన్ గారిపై అన్ని వృత్తుల వారికి మేలు జరుగుతుందనే నమ్మకం ఆయనను అందరి హృదయాలలో నిలిచేలా చేసిందన్నారు. బిసిలను పదవులలో,కొలువులలో సచివాలయ ఉద్యోగాలలో బిసిలకు అత్యధిక ప్రాధాన్యత ఇఛ్చిన ఘనత శ్రీ వైయస్ జగన్ గారికి దక్కుతుందన్నారు. పరిపాలనలో సైతం బిసిలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆయనకు అండగా నిలవాల్సిన బాధ్యత బిసిలందరిపై ఉందన్నారు. నాయిబ్రాహ్మణుల గౌరవం ఇనుమండించేలా నిర్ణయాలు తీసుకున్నారని తెలియచేశారు.

     సభలో పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు,శాసనమండలి సభ్యులు  లేళ్ళ అప్పిరెడ్డి, నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి,నాయీబ్రాహ్మణ సంఘం రాష్ర్ట గౌరవాధ్యక్షులు డాక్టర్ సుబ్బారావు, ఆరెపాటి పెంటారావు,రాష్ర్ట ప్రధాన కార్యదర్శి (ఆంధ్ర) వల్లూరు కోటేశ్వరావు,ఎం సుబ్బరాయుడు(రాయలసీమ)వెంపటాపు లోకరాజు(ఉత్తరాంధ్ర)
రాష్ర్ట కోశాధికారి ఎస్. ధనవిజయుడు గౌరవసలహాదారులు కిందాడ సత్యన్నారాయణ దేవాలయాల జేఏసి అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసు, డైరెక్టర్ తొండమల్లు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top