రాష్ట్రంలో కొత్తశకం మొదలైంది... 

 వైయస్ఆర్ సీపీ  ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  

 సంక్షేమ పథకాల ద్వారా పేదలకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది

 ప్రజా సేవకు మరింత బాధ్యతగా పునరంకితం అవుతాం

 2024 నాటికి 80 లక్షల పేద కుటుంబాలు సొంతింటి  హక్కుదారులవుతారు

 మేనిఫెస్టోలో చెప్పిన హామీలలో 95 శాతం ఇప్పటికే అమలు చేశాం

 30 నెలల్లో రూ. 1. 16 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లో చెల్లింపులు

  వంద రూపాయల పని చేసి.. మేం పావలా కూడా ప్రచారం చేసుకోవడం లేదు.

  ప్రతిపక్షం అంటే తిట్టడం, కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే పని అన్నట్టుగా తయారైంది

  బాబు హయాంలో కట్టిన పిచ్చుక గూళ్ళులా కాదు..  జగనన్న కాలనీల పేరుతో ఊళ్ళకు ఊళ్ళే తయారవుతున్నాయి.

  పండించిన పంటకు పొలం గట్టు దగ్గరే మద్దతు ధర లభిస్తుంది

 గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు అన్ని సేవలు కల్పిస్తున్నాం

 ఒకవైపు వైయ‌స్ జగన్ గారు దేశానికే ఆదర్శప్రాయంగా, ప్రగతిశీలమైన అభివృద్ధి సాధిస్తుంటే.. మరోవైపు అత్యంత నీచ స్థాయిలో ప్రతిపక్షాల విష ప్రచారం

 మీది ప్రజల ఎజెండానా లేక మతపరమైన ఎజెండానా..? 

 శిలువ, మసీదులు తప్పితే ప్రతిపక్షాలకు ఏమీ కనిపించడం లేదు 

 లౌకికవాద శక్తులు ఇటువంటి శక్తులతో కొట్లాడకపోగా.. తిరుపతిలో వేదికను ఎలా పంచుకున్నారు 

 వైయ‌స్  జగన్ గారు సృష్టిస్తున్నది హ్యూమన్ క్యాపిటల్, హ్యూమన్ అసెట్స్.. 

 రాష్ట్ర  ప్రజలకు,  పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 

తాడేప‌ల్లి: రాష్ట్రంలో కొత్తశకం మొదలైందని వైయస్ఆర్ సీపీ  ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.  2022 నూతన సంవత్సరం రాష్ట్రాని కి శుభప్రదం కావాల‌న్నారు.   రాష్ట్ర ప్రజలంతా సుఖ, సంతోషాలతో వర్థిల్లాల‌ని ఆకాంక్షించారు. పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, సిబ్బంది, మీడియా సంస్థలకు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున‌  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శ‌నివారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

 కొత్త సంవత్సరంలో అనేక పాత అనుభవాలు, జ్ఞాపకాలు.. వాటిలో తీపి, చేదు అన్నింటినీ నెమరు వేసుకుని, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నందున బాధ్యతాయుతమైన ప్రజాపక్షంగా తన బాధ్యతను మరింత పెంచుకుంటూ, ప్రజా సేవలో పునరంకితం అవుతూ,  జగన్‌ మోహన్‌ రెడ్డిగారి  మార్గనిర్దేశంలో మరింత మెరుగైన సేవలను అందిస్తాం. 
- జరిగిన ఈ 30 నెలల్లో ఆఫ్‌ వే మార్క్‌ను దాటాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం రాష్ట్ర విభజన తర్వాత తొలి అయిదేళ్లు చంద్రబాబు పాలన చూశాక.. ఎంత ఛీదరింపుతో, ఏహ్యభావంతో దాన్ని తిరస్కరించారో... అంతే ఆశతో, ఆకాంక్షలతో తమ కోరికలు తీర్చుతారు, విభజన తర్వాత రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడుపుతారనే ఆశతో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి మీద నమ్మకంతో 2019లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి భారీ మెజార్టీతో అధికారంలోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
- ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,  2019 మే 30న ముఖ్యమంత్రిగా జగన్ గారు పగ్గాలు చేపడితే.. ఇప్పుడు 2020-21 నాటికి 30 నెలలు పూర్తి చేసుకున్నాం. కోవిడ్‌ వల్ల ప్రపంచం అంతా ఎలా కుదేలైందో, భారతదేశంలో అన్ని రంగాలపై ఎలాంటి ప్రభావం చూపిందో, మన రాష్ట్రంపైన కూడా ఎటువంటి ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. అలాగే రాష్ట్ర విభజన తర్వాత ఎలాంటి వనరులు లేకుండా మన రాష్ట్రం ఏరకంగా దెబ్బతిన్నాదో.. అప్పటికే టీడీపీ చేసిన రుణ భారంతో కుంగిపోయిన రాష్ట్రానికి మేము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రెండో దెబ్బ కరోనా. ఇప్పటికీ దాని ప్రభావం తగ్గకుండా ఒకటి, రెండు దశలు పూర్తి చేసుకుని, మూడో దశగా ఒమిక్రాన్‌ వైరస్‌ పేరుతో మరోసారి వస్తున్న నేపథ్యంలో ఎంతకాలానికి సజావుగా వ్యవస్థ గాడిలో పడుతుందనేది చెప్పలేని పరిస్థితి. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఏడు, ఎనిమిది నెలల పాటు మాత్రమే పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. ఆ తర్వాత నుంచి సవాళ్ల మీద సవాళ్లు ఎదుర్కొవాల్సి వచ్చింది. వాటన్నింటిని తట్టుకుంటూ, అదే సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్ని తూ.చ తప్పకుండా చెప్పినదానిక కంటే ఎక్కువగానే తొలి ఏడాదిలోనే 95శాతం వరకూ అమలు చేయడమే కాకుండా,  వందకు వందశాతం అమలు దిశగా ముందుకు నడుస్తున్నాం. జగన్ మోహన్ రెడ్డిగారు ప్రవేశపెట్టిన పథకాలును పూర్తి శాచురేషన్ విధానంలో, ఒక క్యాలెండర్‌ ప్రకారం అమలు చేస్తున్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

 సచివాలయాలు ప్రజా జీవనంలో భాగం అయ్యాయి 
జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ప్రకటించిన పథకాలు ఆషామాషీవి కాదు. ఆ పథకాలను కిందస్థాయి వరకూ అమలు చేయగలిగేలా కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవస్థలైన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థల ద్వారా ఒక రూపం తీసుకోవడమే కాకుండా, జనజీవనంలో ఒక భాగం అయింది.  ఈ 30 నెలల్లో దాదాపు 1.16 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేసిన ఘటన దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. ఎక్కడా ఆశ్రిత పక్షపాతం, ఆలస్యం, రెడ్‌టేపిజం, రాజకీయ పార్టీల జులం లేకుండా, రాజకీయ పార్టీల తేడాలు కానీ చూడకుంగా, కుల, మత, ప్రాంత విభేదాలు లేకుండా కేవలం అర్హత ఉంటే... అందులోనూ వీలైనంత వెసులుబాటు కల్పిస్తూ, ఆ అర్హతపై కూడా ఈరోజు, రేపు వచ్చినా.. అర్హుల జాబితాలో చేరేలా, దానికి అవసరం అయిన వెసులుబాటు ఇవ్వడంతో పాటు,  శాచురేషన్‌ పద్ధతిలో ముందుకు వెళుతున్నాం. 
 
టైమ్‌ లిమిట్‌ పెట్టకుండా, వారికి ఇస్తున్న బెనిఫిట్‌ ను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపించడం అనేది ముఖ్యమంత్రిగారు తనకు తానుగా ఓ సామాన్య లబ్ధిదారుల స్థానంలో ఊహించుకుని, ఏయే రకాల ఇబ్బందులు వస్తాయో ఊహించుకుని చేసినందువల్లే ఇది సాధ్యం అయింది. కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితులను తట్టుకుంటూ, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ కొనసాగించడం అనేది జగన్‌ మోహన్‌ రెడ్డిగారు మాత్రమే చేయగలిగిన గొప్ప సత్కారం అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సగర్వంగా చెప్పుకుంటుంది. రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది కాబట్టే మిగతా రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. దీనికి ఇంతకంటే పెద్ద ఫ్రూప్‌ అక్కర్లేదు. 

రాష్ట్రంలో ప్రతిదీ ఓ ట్రెండ్ సెట్టరే..
 రాష్ట్రంలో ఏ పథకం అమలు చేసినా, ఏ విధానం తీసుకొచ్చినా.. ప్రతీది ఒక ట్రెండ్‌ సెట్టర్‌ లాంటిదే. ఉద్యోగ కల్పన కూడా అలాంటిదే. మేము చేసిన పనులపై ప్రచారం చేసుకోలేకపోతున్నాం.  సచివాలయాల వ్యవస్థ ద్వారా ఏకంగా లక్షా 30 వేలు ఉద్యోగాలు కల్పించాం, అయినా వాటి గురించి అంతగా ప్రచారం చేసుకోలేదు. ఉద్యోగాల కల్పన అనేది మా బాధ్యతగా అనుకున్నామో తప్ప, దానిపై ప్రచారం చేసుకుని లబ్ధి పొందాలని చూడలేదు. అలాగే 600 జూనియర్‌ అసిస్టెంట్లు, మెడికల్‌ సిబ్బంది నియామకాలపై క్యాలెండర్‌ ప్రకారం వెళుతున్నాం. పావలా పని చేసి వంద రూపాయలు ప్రచారం చేసుకునేవారికి పోటీగా కాకుండా.. వంద రూపాయలు పనిచేసినా.. కనీసం పావలా వంతు కూడా ప్రచారం చేసుకోకుండానే, దీమాగా ఉండగలడం అనేది జగన్‌ మోహన్‌ రెడ్డి గారికే చెల్లింది.  అన్ని వివక్షలకు, విచక్షణలకు అతీతంగా శాచురేషన్‌ బేసిస్‌ మీద ఎంతవరకూ అంటే ఆఖరు లబ్ధిదారుడు వరకు అందించేలా మేం కంకణం కట్టుకుని పనిచేస్తున్నాం. దాంతో లబ్ధిదారులే గుర్తించి ప్రచారం చేస్తున్నారు, వాళ్లే మా ప్రచారకర్తలు. ప్రజలు, పేదల మీద ఉన్న పరిపూర్ణమైన నమ్మకంతో మేము ప్రచారం చేసుకోవడం లేదు.

 ప్రతిపక్షం తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు 
ప్రతిపక్షం అంటే ప్రతిక్షణం ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకుని, విషం కక్కుతూ, ప్రచారం చేసేవారి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. ప్రతిపక్షం అంటే కోడిగుడ్డకు ఈకలు పీకటమే పనిగా పెట్టుకున్నా వారిని మేము పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన పేదల మొహాల్లో చిరునవ్వు ఉదయిస్తుంది. వాళ్లకు సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ వచ్చింది. ముఖ్యమంత్రిగారు మాట తప్పకుండా అవ్వా, తాతలకు పెన్షన్‌ పెంచారు. దీన్ని కచ్చితంగా అందరూ గుర్తించాల్సిన అంశం. 

 అన్నింటికంటే పెద్దగా చెప్పుకోవాల్సింది 30 లక్షల ఇళ్ల నిర్మాణం అనేది భారీ పథకం. ముప్పై లక్షల ఇళ్లకు దాదాపు రూ.10 వేలకోట్లు భూమి కొనుగోలు మీదనే వెచ్చించి, తొలిసారి అక్కచెల్లెమ్మల పేరు మీద సొంత ఇంటి యజమానులుగా చేయడం జరిగింది. వారికి భవిష్యత్‌లో సొంత ఆస్తి చేకూరేలా చేశాం. దీనిపై కడుపుమంటతోనే టీడీపీ కోర్టుకు పోయింది. వాటి నుంచి కూడా త్వరలో బయటపడతాం. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇవ్వరు. మరొకరిని ఇవ్వనివ్వరు. ఎందుకంటే పేదలు ఎప్పుడూ పేదలుగానే ఉండాలి. అప్పుడే వారికి తాయిలాలు ఆశ పెట్టి, ఓట్లు వేయించుకోవచ్చనే వైఖరితో టీడీపీ  ఉంది. కానీ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఎప్పుడూ పేదలు తమ కాళ్లమీద తాము నిలబడేలా, వాళ్ల స్వయం నిర్ణయం వాళ్లు తీసుకోవాలనేలా ఆలోచిస్తారు. ఎన్నికల ముందు ఇచ్చే తాయిలాలను చూసి ఎవరికైనా ఓటు వేయడం ప్రజాస్వామ్యం కాదనేది జగన్‌గారి అభిమతం. అందుకే ఎన్నికలు ఇంకా మూడేళ్లు ఉన్నాయనగానే.. చెప్పిన హామీలు, చెప్పనివి కూడా చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం.

 గేటెడ్ కమ్యూనిటీల్లా జగనన్న కాలనీలు నిర్మాణం 
 జగనన్న కాలనీల ద్వారా గేటెడ్‌ కమ్యూనిటీస్‌ తరహాలో అన్ని సౌకర్యాలతో ఊళ్లకు ఊళ్లే తయారు అవుతున్నాయి. ప్రస్తుతం గ్రౌండ్‌ వర్క్‌ నడుస్తోంది. చంద్రబాబులా జీ ప్లస్‌ త్రీ ఇళ్ళు ఇచ్చినట్టుగా, వృద్ధులు, నడవలేనివారు పై అంతస్తులకు ఎలా వెళ్ళాలో తెలియని పిచుకగూళ్లులాంటి ఇళ్ళు కాకుండా సొంత స్థలంతో ఇళ్లు కట్టిస్తున్నాం. అలానే, గతంలో నిర్మించుకుని, వాటిపై హక్కులు లేకుండా ఉన్న 50 లక్షలకు పైగా ఉన్న ఇళ్లకు ఓటీఎస్ ద్వారా... వాటిలో ఉన్న లబ్ధిదారులకు పూర్తి హక్కులతో సొంతం అయ్యేలా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అవి అసైన్డ్‌ స్థలాల్లో ఉన్నా, అమ్ముకోవడానికి, లోన్‌ తీసుకోవడానికి కుదరదు. అలాంటివి పూర్తిగా పేదవారి సొంతం చేస్తున్నారు. ఓటీఎస్‌ ద్వారా నామమాత్రపు ఫీజు కట్టించుకుని వారి పేరుమీద ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తున్నారు. దాంతో వాళ్లు కూడా సొంతి ఇంటివాళ్లు అవుతారు. 
 
 గతంలో అసలు కడితే వడ్డీ మాఫీ చేయడం అప్పుడప్పుడు జరిగేది. 2000 నుంచి 2014 వరకూ 2లక్షల మంది ఆ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. చంద్రబాబు హయాంలో అది కూడా చేయలేదు. 43వేల మంది అసలు, వడ్డీ కట్టి అసైన్డ్‌ స్థలాల్లో ఉన్న ఇళ్లను సొంతం చేసుకున్నారు. అదే జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వం  నామమాత్రపు రిజిస్ట్రేషన్‌ ఫీజు ద్వారా  అసలు, వడ్డీ మాఫీ చేస్తోంది. బ్రహ్మాండమైన ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందం అయినా దానిపై కూడా ప్రతిపక్షం తాటాకులు కట్టాలని చూస్తోంది. 
- ఈ 50 లక్షల ఇళ్లు, జగనన్న కాలనీల్లో కట్టబోయే మరో 30 లక్షలు కలిపి.. మళ్లీ ఎన్నికలకు వెళ్లే 2024నాటికి రాష్ట్రంలో 80లక్షల మంది కుటుంబాలు పూర్తిగా తమ సొంత ఇళ్లల్లో, పిల్లా పాపలతో ఆనందంగా గడపనున్నారు. 

 జగనన్న అమలు చేస్తున్న నాడు-నేడు కార్యక్రమం దగ్గర నుంచి అంగన్‌వాడీల నుంచి కాలేజీల వరకూ, నూతన భవనాలు, ప్రాంగణాల్లో చదువుకుంటూ చిన్నపాటి వైద్యపరమైన అవసరం వస్తే ప్రభుత్వ ఆస్పత్రులు, సూపర్‌ స్పెషాల్టీ, మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రుల ద్వారా, తాము ఉన్న గ్రామాల్లో తమ పక్కనే ఉన్న మెడికల్‌ ఆస్పత్రి వరకూ ఒక చైన్‌ లింక్‌ ఏర్పాటు అయితే  అంతకన్నా స్వర్గం ఏముంటుంది.

పొలం గట్టు దగ్గరే పండిన పంటలకు మద్దతు ధరలు
రైతులు పండించిన పంటకు పొలం గట్టు దగ్గరే ధరలు వస్తుంటే, ఆర్బీకేల ద్వారా కావల్సిన సలహాలు, సూచనలు, మద్దతు ధరలు రైతులకు అందుతున్నాయి. మరోవైపు ప్రతి గ్రామంలో 2వేలమంది ఉండేచోట గ్రామ సచివాలయం ద్వారా అన్ని సేవలు అందుతుంటే... ఇంతకుమించి అతి తక్కువ కాలంలో సాధించినవి గతంలో కానీ, భవిష్యత్‌లో కూడా ఉంటాయా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం.
- ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం మహా యజ్ఞంలా పనిచేస్తుంటే.. మరోవైపు ప్రతిపక్షం మాత్రం సంబంధం లేని విషయాల మీద విషం కక్కడమే పనిగా పెట్టుకుంది. 

   "జిన్నా టవర్‌, కింగ్‌జార్జ్‌ అంటారు.. అమరావతి రాజధాని కోసం న్యాయస్థానం నుంచి దేవస్థానం యాత్రలు అంటారు. రాష్ట్రంలో గూండారాజ్యమేలుతుందంటారు. ఒక వ్యక్తి తనకు ప్రాణహాని ఉందని అనగానే చంద్రబాబు ఇంతపెద్ద లేఖ రాస్తారు." ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలలో  ప్రశ్నించేందుకు ఏమీలేదో.. ఏది దొరికితే దాన్ని... దొరక్కపోతే క్రియేట్‌ చేసి మరీ రాజకీయ ఎజెండా తయారు చేసుకుని ... అదే ప్రజల ఎజెండా అని భ్రమకలిగించే మీడియాను అడ్డు పెట్టుకుని గత రెండున్నరేళ్ల నుంచి చేసే ప్రయత్నాలను చూస్తూనే ఉన్నాం.

దేశానికే ఆదర్శమైన పరిపాలన జగన్ గారు అందిస్తున్నారు
సీఎం వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అత్యంత ప్రగతిశీలమైన, దేశానికే ఆదర్శప్రాయమైన పరిపాలనను అందిస్తుంటే... ఇంకోపక్క అత్యంత నీచమైన, నికృష్టమైన విష ప్రచారం అంతే పెద్ద ఎత్తున జరుగుతోంది. బహుశా 20ఏళ్ల క్రితం ఇలాంటి రాజకీయ వాతావరణం ఎవరూ చూసి ఉండరు. 1960-1970ల నుంచి చూస్తే అప్పట్లో ఆదర్శప్రాయమైన రాజకీయ వాతావరణం ఉండేది. అక్కడ నుంచి రకరకాల ఆకారాల్లోకి మారుతూ.. ఇప్పుడు సోషల్‌ మీడియాల ద్వారా ఇష్యూస్‌, డైమెన్షన్స్‌, డెప్త్‌ అన్ని మారిపోయాయి.
  కానీ ఘోరం ఏమంటే.. ప్రజల్లో అవగాహన పెరుగుతోంది కానీ, కమ్యూనిటీ పరంగానో, సామాజికంగా అవేర్‌నెస్‌ తగ్గుతోంది. వాటిపై అవగాహన తీసుకురావాల్సిన రాజకీయ పార్టీలు పూర్తిగా ఆ బాధ్యత నుంచి తప్పుకున్నాయని కళ్లముందే కనిపిస్తోంది. ఆదశలో ఆనాటి ఆదర్శన్ని... ఈనాటి ఆచరణాత్మకమైన మేళవించిన ఆలోచనలు రెండున్నరేళ్లలో జగన్‌ మోహన్‌ రెడ్డిగారు చేసిన ప్రయత్నం బ్రహ్మాండమైన రీతిలో సక్సెస్ చేస్తున్నారు. దానికి తగ్గ ప్రశంసలు వస్తున్నాయి.

 దున్నేవాడిదే భూమి అన్న కమ్యూనిస్టులు.. పేదల స్థలాలను అడ్డుకుంటున్న శక్తులతో ఏకమయ్యారు 

 ప్రతిపక్షాలు అనేవి వ్యవస్థలోని లోపాలు ఎత్తి చూపించాలి. దాని బాధ్యత కూడా అదే. ఒకప్పడు వామపక్షాలు, సీపీఐ లాంటి పార్టీలు దున్నే వారిదే భూమి అన్నట్లు పోరాటం చేశావారనేది ఇటీవలే చీఫ్‌ జస్టిస్‌ గారు కూడా గుర్తు చేసుకున్నారు. అదే కమ్యునిస్టులు అమరావతిలో పేదలకు స్థలాలు ఇస్తామంటే డెమోగ్రాఫిక్ ఇం బ్యాలెన్స్ వస్తుందని, దాన్ని వ్యతిరేకించే శక్తులతో చేతులు కలిపారు. లౌకికవాద శక్తులు ఇటువంటి శక్తులతో కొట్లాడకపోగా.. తిరుపతిలో వేదికను ఎలా పంచుకున్నారు. మీ ఉద్దేశం.. ఒకవర్గం వాళ్లే అక్కడ ఉండాలనా? పేదలు ఉండకూడదనా? ఇది దేనికి చిహ్నమనేది అర్థం కావడం లేదు.

 బీజేపీది మతపరమైన ఎజెండా..
అలాగే బీజేపీ కూడా జాతీయ పార్టీ. ప్రజలకు సంబంధించి సమస్యలపై ఎజెండాతో రావాలా? లేక మతమే ప్రధానంగా తీసుకుని రావాలా అనేది వాళ్లు ప్రశ్నించుకోవాలి. వారికి మసీదు, చర్చి తప్ప మరొకటి గుర్తుకు రావడం లేదు. అలాంటి శక్తులకు ప్రజలు ఎలా మద్దతు ఇస్తారు. దింపుడు కల్లం ఆశతో చూసే పార్టీఅది.  ఏది దొరికినా సరే.. దాన్ని తెచ్చి, రాజకీయం చేసి ఇదే ప్రజాభిప్రాయం అని చూపుతూ..  దానికి తాము నాయకత్వం వహిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చి, ఎన్నికల్లోకి రావాలని చూస్తున్న పార్టీ అది. వీటన్నింటినీ దీటుగా తట్టుకుని, తిప్పికొట్టే శక్తి వైయస్సార్‌ సీపీకే ఉంది. ఎందుకంటే ప్రజలు మాకు సంపూర్ణంగా మద్దతుగా నిలవడమే. వీరి కుట్రలను ప్రజలు గమనించి తిప్పికొట్టాలని కోరుతున్నాం.  

వైయ‌స్ జగన్‌  క్రియేటింగ్‌ హ్యూమన్‌ క్యాపిటల్‌ అండ్ ఎసెట్స్
 ముఖ్యమంత్రిగారు సంక్షేమంతో పాటు పారదర్శకతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు క్రియేటింగ్‌ హ్యూమన్‌ క్యాపిటల్‌, ఎసెట్స్. అయిదుకోట్ల మందిలో యువత ఎంతమంది తయారు అవుతారో వారు హైలీ ఎడ్యుకేటెడ్‌ స్కిల్స్‌తో బయటకు రాబోతున్నారు.  నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తీర్చిదిద్దుతున్న స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్బీకేలు ఆస్తులే తప్ప మరొకటి కాదు. వాటి నుంచి వచ్చేవి కొత్త ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు, పునరుజ్జీవనం ఇచ్చేవి.
- దీర్ఘకాలికంగా సుసంపన్నమైన, ఆరోగ్యదాయకమైన, విద్యాదాయమైన రాష్ట్రాన్ని సృష్టించడానికి బంగారుబాటలు జగన్ గారు వేస్తున్నారు. ఇందులో ఏంతప్పు ఉందో ఈ శక్తులు చూపించాలి. తన, మన, పర, భేదం చూడకుండా చర్యలు తీసుకోవడానికి తగిన వ్యవస్థ ఏర్పాటైంది. దాన్ని ఉపయోగించుకునేందుకు అందరూ చొరవ చూపించాలి. 

ప్రతిపక్షాల విష ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదన్నది రుజువైంది
- ప్రభుత్వ అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలకు  ప్రతిపక్షాలు నానా రకాలా అడ్డంకులు సృష్టించినా.. వరుసగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ద్వారా మాకు ప్రజల మద్దతు ఉందని స్సష్టమైంది. ప్రతి ఎన్నికల్లో 80-90శాతం వరకూ వైయస్సార్‌ సీపీ గెలుచుకుని పార్టీ పరమైన బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రతిపక్షాల  విష ప్రచారాలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. బడుగులు, వెనుకబడిన, అట్టడుగు వర్గాలకు, మహిళలకు హామీలు ఇచ్చినట్లుగానే వైఎస్‌ జగన్‌ గారు అన్ని పదవుల్లోనూ వారికి సముచిత స్థానం కల్పించారు. నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ పనుల్లోనూ ఆ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా చట్టం చేయడం ఒక చరిత్ర.  వారు రాజకీయంగా చైతన్యవంతులై పూర్తి సాధికారతతో ఉండాలని చేయూత కింద ఇస్తున్న పథకాలే నిదర్శనం.

ఇంటికి యజమానురాలు అన్నది ఏపీలోనే కనిపిస్తుంది
ఇంటికి యజమానురాలు అనేది కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే మహిళలకు అన్నివిధాలా ప్రాధాన్యత కల్పించిన ఘనత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిది అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి,  ప్రతిపక్షం ఇచ్చే నిర్మాణాత్మక, ఆచరణాత్మక సలహాలు స్వీకరించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ప్రతిపక్షం ఇప్పటికైనా తమ ఎజెండాను మార్చుకోకపోతే... జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఫిక్స్‌ చేసిన ఎజెండానే ఉండబోతుంది. 
 చంద్రబాబు, తనకు తెలిసిన గారడీ విద్యలనే ప్రయోగించి విసుగు చెందకపోవచ్చు. కాలం మారింది. ఇటువంటి రాజకీయాలు చేయడం వల్ల ఆయన ఎందుకు పనికిరాడు అనే అభిప్రాయం ప్రజల్లో ఇప్పటికే వచ్చింది. బెటర్‌ అపోజేషన్‌ పార్టీగా ఉంటే బాగుంటుంది. అప్పుడే ప్రభుత్వ పరిపాలన ఏంటనేది తెలుస్తోంది. అందుకు జగన్‌ గారు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు.
ఎన్నికలు వచ్చే సమయానికి ఓవైపు ప్రతిపక్షం కుట్రలను ఎదుర్కొంటునే.. మరోవైపు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు క్రియేట్‌ చేసిన కొత్త వ్యవస్థల్లో అందరూ భాగస్వాములు కావాలని  వైయస్ఆర్ సీపీ  ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  ఆహ్వానించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top