జనరంజక పాలనకు ప్రజలు మరోసారి పట్టం

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

 ఏలూరులో జనమంతా ఒకేమాటగా వైయస్‌ఆర్‌సీపీకి ఓటేశారు

సీఎం వైయస్‌ జగన్‌ పాలనను ఏలూరు ప్రజలు ఆశీర్వదించారు

12 కార్పొరేషన్లను వైయస్‌ఆర్‌సీపీ దక్కించుకుంది

పరిషత్‌ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు కనిపిస్తాయి

రాజ‌ధాని ప్రాంతంలో రియ‌ల్ ఎస్టేట్ ఆదాయం త‌గ్గిన వారే కంక‌ర అమ్ముకుంటున్నారేమో?

చంద్ర‌బాబు పాల‌న‌లో క‌ర‌క‌ట్ట రోడ్డు వెడ‌ల్పు చేయ‌లేక‌పోయారు

తాడేప‌ల్లి: జనరంజక పాలనకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏలూరు కార్పొరేషన్‌ ఫలితాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కులాలు, మతాలు, పార్టీలకతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలిపారు.  రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లను వైయ‌స్ఆర్‌సీపీ దక్కించుకుందన్నారు.  ఏలూరులో జనమంతా ఒకేమాటగా వైఎస్సార్‌సీకి ఓటేశారు. ఏలూరులో వైయ‌స్సార్‌సీపీకి 56.3 శాతం మంది ఓటేశారు. టీడీపీ ఏలూరులో 28.2 శాతానికే పరిమితమైంది. ఎన్నికల్లో వైయ‌స్సార్‌సీపీకి ప్రజలు ఏకపక్షంగా పట్టం కట్టారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల్లోనూ ఇవే ఫలితాలు కనిపిస్తాయని సజ్జల రామకృష్ణారెడ్డి  దీమా వ్య‌క్తం చేశారు.  సోమ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

 
రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగిన  నేపథ్యం, అన్ని చోట్ల వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థులు ఘ‌న విజ‌యం  సాధించింది విధిత‌మే.  అయితే ఏలూరు కార్పొరేష‌న్‌ ఎన్నికల ఫలితాలు ఆపారు. నిన్ననే ఆ ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. జనరంజక పాలన, ప్రజారంజక పాలన ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో మ‌రోసారి రుజువైంది. ప్రజల అవసరాలు తెలుసుకొని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా వైయస్‌ జగన్‌ రెండేళ్లుగా పాలన అందిస్తున్నారు. దాని ఫలితం ఎలా ఉంటుందని అనేది ఎన్నిక అప్పుడే జరిగినా.. ఫలితం నిన్న రావడంతో రుజువైంది. 
ఈ సందర్భంగా మరోసారి ప్రజలతో మమేకమై, ప్రజలతో ఉన్నామని, ప్రజలు వైయ‌స్ జ‌గ‌న్‌కు దీవెనలు అందిస్తారని చెప్పేందుకు ఏలూరు ఫ‌లితాలే నిద‌ర్శ‌నం. 

 ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని 12 నగర పాలన, 75 పురపాలన సంఘాల‌కు ఎన్నికలు జరిగితే..అందులో 74 మున్సిపాలిటీలు వైయస్‌ఆర్‌ సీపీకి వచ్చాయి. రాష్ట్రంలోని మొత్తం 12 కార్పొరేషన్లు పూర్తిగా వైయస్‌ఆర్‌సీపీకి పట్టం కట్టారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎలాంటి ప్రలోభాలు లేకుండా, హింసాకాండ లేకుండా అత్యంత సజావుగా అందరికి సమాన అవకాశాలు పోటి చేసేందుకు ఇచ్చి..ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పి ప్రజల మద్దతుతో వైయస్‌ఆర్‌సీపీ  విజయం సాధించింది. 

గతంలో, ఇప్పుడు వచ్చిన ఓట్ల శాతం చూసినా 2019 ఎన్నికల నాటి నుంచి చూస్తే రాష్ట్ర ప్రజలు టీడీపీని తిరస్కరించి   23 ఎమ్మెల్యే సీట్లకు పరిమితం చేశారు. పార్లమెంట్‌లో కూడా 3 ఎంపీ స్థానాలు కేవలం 10 వేల మెజారిటీతో తీర్పు ఇచ్చారు. మాకు 50 శాతం పాజిటివ్‌ ఓటుతో వైయస్‌ఆర్‌సీపీని అధికారంలోకి తీసుకువచ్చి..వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. రెండేళ్ల తరువాత అంతకు మించిన దీవెనలు, విశ్వాసం ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో వ్యక్తం చేశారని కనిపిస్తోంది. సీట్ల పరంగా, ఓట్ల పరంగా రుజువైంది. 

ఏలూరు అన్నది డివైడ్‌ అయిన ఏరియా, అన్ని రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యే ఏరియా అది. అక్కడ కూడా జనమంతా కూడగట్టుకుని వైయస్‌ జగన్‌ పాలన మాకు బాగుందని, అదే పాలన కావాలన్నట్లుగా నిన్న ఫలితాలు వచ్చాయి. 

2019 ఎన్నికల్లో ఏలూరు కార్పొరేషన్‌ పరిధిలో వైయస్‌ఆర్‌సీపీకి 44.73 శాతం అయితే..టీడీపీకి 42.21 శాతం ఓట్లు అప్పట్లో వచ్చాయి.  నిన్నటి ఫలితాల్లో వైయస్‌ఆర్‌సీపీకి 56.43 శాతం ఓట్లు అయితే..టీడీపీకి 28.2 శాతమే. ఈ ఫలితాలు ఒక్క ఏలూరులో మాత్రమే కాదు..ఇటీవల నిర్వహించిన తిరుపతి ఉప ఎన్నిక అయినా, ప్రాంతాలకు అతీతంగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ మొత్తంగా కూడా పాజిటివ్‌ ఓట్లే కాదు..అంతకుమించి వచ్చాయి. 

రెండేళ్ల తరువాత ప్రభుత్వంపై కొంత వ్యతిరేక ఓట్లు వస్తాయని అందరూ అనుకుంటారు. లేదా అడ్డగోలుగానైనా ఎన్నికలు జరగాలి. ఇవి రెండు లేకుండా సజావుగా ఎన్నికలు జరిగితే వచ్చిన  ఫలితాలు ఇవి. నిన్నటి ఫలితాల్లో 56 శాతం వైయస్‌ఆర్‌సీపీకి వచ్చాయంటే పాజిటివ్‌ ఓటుకు మించి తిరుగులేని విజయం. ఆ రోజు 42 శాతం వచ్చిన ఏలూరులో ఈ రోజు 28 శాతం ఓట్లు వచ్చాయి. అలాగే జనసేన పార్టీకి 2019లో వచ్చిన ఓట్లు 16681 ఓట్లు ..ఇప్పుడు 7407 ఓట్లు..సీట్ల పరంగా ఒక్కటి కూడా రాలేదు. బీజేపీకి ఆ రోజు 5976 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

ఏలూరు మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని పార్టీలను ప్రజలు తిరస్కరించి వైయస్‌ఆర్‌సీపీకి ఏకపక్షంగా ప్రజలు పట్టం కట్టారని ఈ ఫలితాల ద్వారా తెలుస్తోంది. ఇదే ట్రెండ్‌ గతంలో నిర్వహించిన మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ ప్రతిభింబించింది. రేపు పరిషత్‌ ఎన్నికల్లోనూ కూడా  ఇదే ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. పాజిటివ్, అనుకూల ఓటు ప్రజలు వేస్తారని నిన్నటి ఫలితాల్లో కనిపించింది. 

పరిషత్‌ ఎన్నికలు కూడా ఎప్పుడో పూర్తి కావాల్సింది. విజయోత్సవాలు కూడా జరుపుకునే వాళ్లం. అప్పటి ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ ఎక్కడ ఉన్నారో తెలియదు. నిమ్మగడ్డను ముందు పెట్టి టీడీపీ జరిపిన పోరాటాలు ఎన్ని చేసినా ఫలితాలు ఆపగలిగారే తప్ప..మరేమి చేయలేరు. ప్రజలు మాత్రం ఒక నిర్ణయానికి వచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలంతా వైయస్‌ జగన్‌ పక్షాన ఉన్నారు. అన్ని ఫలితాలు  ఒకసారి కాకుండా మాకు అంచలంచెలుగా విజయోత్సవ అవకాశాలు ఇచ్చినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు, నిమ్మగడ్డకు ఒకసారి కృతజ్ఞతలు తెలపాలని నాకు పర్సనల్‌గా అనిపించింది. రేపు మళ్లీ పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వస్తే విజయోత్సవాలు జరుపుకుంటాం. ఒకరోజులో పోయదానికి బదులు అంచలంచెలుగా అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 

ఈ రోజు కొన్ని పత్రికలు, టీవీ చానల్స్‌ రాజధాని ఏరియాలో రోడ్లు తవ్వుకుని అమ్ముకుంటున్నారని కథనాలు రాశారు. ఇంత దిక్కుమాలిన ఆలోచన ఎవరికి వచ్చిందో తెలియడం లేదు. కంకర తవ్వి అమ్ముకునే ఆలోచన రాజధాని ప్రాంతంలోనే ఎందుకు వస్తుంది. తల మాసిన వెధవ ఎవరూ ఉంటారని అనుకోను. వాళ్లను ఆపేందుకు దళిత వేదిక నాయకులు వెళ్తే జేసీబీతో కలిసి పరుగెత్తారని రాశారు. ఇది నమ్ముతారా? నమ్మరా అన్నది లేకుండా వాళ్లు ఒకటి రాయడం, చంద్రబాబును, లోకేష్‌ను ముంచుతున్నారు. లేదా టీడీపీ కల్చరే అదేనేమో? లేదా టీడీపీ నేతల ఆదాయం తగ్గి ఇలా రోడ్లు తవ్వి కంకర అమ్ముకుంటున్నారేమో?. రియల్‌ ఎస్టేట్‌ మాఫియా ప్లాన్‌ను వైయస్‌ జగన్‌ పటాపంచాలు చేశారు. అలాంటి వారికి ఆదాయం తగ్గి కంకర అమ్ముకుంటున్నారేమో తెలియదు. ఏదైనా పాయింట్‌ ఉంటే స్ట్రైట్‌గా ఉండాలి.  

 చంద్రబాబు సీఎంగా ఉండగా కరకట్టపై రోడ్డును వెడల్పు చేయలేకపోయారు. ఆ రోడ్డుపై రెండో వాహనం వెళ్లేందుకు వీలు లేదు. చంద్రబాబుకు ఈ విషయం ఎవరైనా చెప్పి ఉండవచ్చు కదా? ఆ రోడ్డును ఇప్పుడు వైయస్‌ జగన్‌ వెడల్పు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు కథనాలు రాయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

చట్టప్రకారమే సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ పరీక్ష

  సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ కోసం పరీక్ష చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నామని.. అందరు ఉద్యోగులకు ఇలాంటి రూల్‌ ఉందని వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.  ఉద్యోగాలు ఎక్కడికీ పోవని.. పరీక్ష పాస్ కాకుంటే ప్రొబేషన్‌లోనే ఉంటారని ఆయన వివరణ ఇచ్చారు.

డిపార్ట్‌మెంట్ టెస్టులు ఏటా ఏపీపీఎస్సీ రెండుసార్లు నిర్వహిస్తుందని.. ఈ విధానంలో ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. జాబ్ క్యాలెండర్‌పై టీడీపీ వాళ్లకి మాట్లాడే అర్హత లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top