ఏపీలో నారా 420కె వైరస్ ను బాబు స్ప్రెడ్ చేస్తున్నాడు

 
వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి 

క‌రోనా క‌ట్ట‌డికి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు 

క‌రోనాపై పోరులో ఇత‌ర రాష్ట్రాల కంటే ఏపీ ముందుంది

అన్ని వ్య‌వ‌స్థ‌లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్నాయి

ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు విడ్డూరం

రోజుకు 6 ల‌క్ష‌ల మందికి వ్యాక్సీన్లు వేసే వ్య‌వ‌స్థ మ‌న‌కు ఉంది

కేంద్రం స‌రిప‌డ డోసులు ఇస్తే 35 రోజుల్లోనే అంద‌రికీ టీకా ఇచ్చేస్తాం

రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమం తప్ప మ‌రో ధ్యాస సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు లేదు

తాడేప‌ల్లి: క‌రోనా క‌ట్ట‌డికి ఏపీ ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని, ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు విడ్డూరంగా ఉన్నాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. వ్యాక్సీన్లు ఎవ‌రి నియంత్ర‌ణ‌లో ఉంటాయో కూడా 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం, 14 ఏళ్లు సీఎంగా ప‌ని చేసిన ప్ర‌స్తుత ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు తెలియ‌దా అని సూటిగా ప్ర‌శ్నించారు. ఏపీ జ‌నాభాలో 90 శాతం మంది ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలో ఉన్నార‌ని గుర్తు చేశారు. కోవిడ్ స‌మ‌యంలో ప‌క్క రాష్ట్రంలో దాక్కున్న ప్ర‌వాసాంధ్రుడు చంద్ర‌బాబు అని విమ‌ర్శించారు. జూమ్ మీటింగ్‌లో ఆ పార్టీ పోలిట్‌బ్యూరో స‌మావేశం నిర్వ‌హించి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం ఆయ‌న‌కు త‌గ‌ద‌న్నారు.  రోజుకు 6 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్లు వేసే వ్య‌వ‌స్థ మ‌న‌కు ఉంద‌ని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వ్య‌వ‌స్థ‌లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్నాయ‌ని, ఏపీలో మెరుగైన ఫ‌లితాలు సాధించామ‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు.  రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు, సంక్షేమం, అభివృద్ధి త‌ప్ప మ‌రో ధ్యాస సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి లేద‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పున‌ర్ఘ‌టించారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో బుధ‌వారం సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

 ఈ రోజు చంద్రబాబు టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్ తర్వాత అంతర్జాతీయ శాడిస్టుల సంఘానికి అధ్యక్షుడిగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో N440K అనే వైరస్‌ ఉందని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆయన స్ర్పెడ్‌ చేయాలనుకుంటున్నదీ N420K వైరస్‌ను N అంటే నారా. 420 అంటే.. ఆయన పుట్టినరోజు. K అంటే ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకు దిగజారుతాడా? 

- ఆంధ్రప్రదేశ్‌కు తగినంత వ్యాక్సిన్‌ పంపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది, ఔషధ కంపెనీలది అయితే వారిని వెనకేసుకు వచ్చేలా ప్రత్యేకించి ఔషధ సంస్థల్ని వెనకేసుకు వచ్చేలా చంద్రబాబు మాట్లాడారు. ఆ కంపెనీలు మందులు ఇవ్వటం లేదని ప్రశ్నించాల్సింది పోయి.. మీరు ఎందుకు ఆర్డర్‌లు పెట్టలేదు అంటూ.. రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం వేశారు. 

 

- కర్నూలు నుంచి ఈ వైరస్‌ పుట్టిందని ఇంగితం ఉన్న ఏ మనిషన్నా అంటాడా? ఈ రాష్ట్రానికి సంబంధించిన చీము, నెత్తురు ఉన్న ఏ మనిషైనా అటువంటి వాదనల్ని అంగీకరిస్తాడా? పరాయి రాష్ట్రంలో ఉన్న చంద్రబాబుకు తెలంగాణ నుంచి కూడా తరిమేస్తారేమో అన్న భయం పట్టుకున్నట్లుంది. అందుకే, ఆంధ్రప్రదేశ్‌ గురించి నోటికి వచ్చినట్లు.. మాట్లాడుతున్నాడు. ఆయన నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఎందుకు అంటే... వేరే రాష్ట్రాలు ఏపీ పౌరులు రాకుండా సరిహద్దుల్ని మూసేశాయని మాట్లాడటం అంటే.. ఇంతకు మించిన నేరం కానీ, కుతంత్రం కానీ, కుట్రపూరిత మనస్తత్వం కానీ ఉంటుందా? ఈయన మాజీ మిత్రులైన ఆయా రాష్ట్రాల పార్టీల వారితో మాట్లాడి ఈయనే ఆయా ప్రభుత్వాలను రెచ్చగొడుతున్నాడా అన్నది కూడా పరిశీలించాలి. 

 

-  తమిళనాడు కంటే, ఒరిస్సా కంటే... ఆంధ్రప్రదేశ్‌ కరోనా నియంత్రణలో ఎంతో ముందుంది. అదే కాదు.. దేశంలోనే కరోనా టెస్టింగుల్లో గానీ, బెడ్లు కేటాయించటంలో గానీ, వేగంగా స్పందించటంలో గానీ, వ్యవస్థను పరుగులు ఎత్తించటంలో గానీ అందరికన్నా ముందు ఉంది. 

 

*కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కిందకు తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏపీనే*

 

-   కరోనా వైద్యంను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువచ్చిన మొట్టమొదటి రాష్ట్రం కూడా ఎపినే. రాష్ట్రంలోని 90 శాతం మంది ఆరోగ్యశ్రీ కిందకు వచ్చారు. ఇలాంటి పరిస్థితి మరే రాష్ట్రంలోనూ లేదు. ప్రణాళికాబద్ధంగా కరోనాను ఎదుర్కొనేందుకు సీఎం శ్రీ వైయస్ జగన్ నేతృత్వంలో ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దానిపై చంద్రబాబు రాజకీయ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. 

 

-  కోవిడ్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పటిష్టమైన యంత్రాంగంతో, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. దానిలో భాగంగానే ఈ రోజు నుంచి కర్ఫ్యూను కూడా అమలు చేస్తోంది. సమర్థవంతమైన రాజకీయ నాయకత్వం, ముందుచూపు ఉన్న ప్రభుత్వం, చిత్తశుద్దితో పనిచేసే అధికారులు, ఉద్యోగుల సమన్వయంతో కరోనాపై ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. దానికి అనుగుణంగానే మంచి ఫలితాలు వస్తున్నాయి. మన దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ కరోనా నియంత్రణ, పేషంట్లకు అందిస్తున్న వైద్య సేవల్లో ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. 

 

-   ఈరోజు ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీసులో కోవిడ్ పరిస్థితులపై కలెక్టర్లలతో ప్రత్యేక రివ్యూలు చేశారు. ఈరోజే కాదు.. ఇది దాదాపు ఒక దినచర్యగా జరుగుతోంది. ఎవరికి వైద్యం అందకపోయినా ఎక్కడ ఆక్సిజన్ అందకపోయినా బాధపడే, స్పందించే, తక్షణ చర్యలు తీసుకునే మనసున్న ప్రభుత్వం మనది. అయితే, లోపాల్ని వెతకటమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు నిత్యం ఏం చేశారో మనం అందరం చూశాం. ఈరోజు పొలిట్‌బ్యూరో జరిగిందని చెబితే... మీడియా అటెన్షన్‌ తెచ్చుకోవచ్చని భావించి పొలిట్‌బ్యూరో అంటూ ఒక డ్రామా నడిపి తను కొట్టదల్చుకొన్న సుత్తి కొట్టి వెళ్లిపోయాడు. 

 

-   మధ్యలో భార్య అందించిన హెరిటేజ్ మజ్జిగ తాగాడు. ఇళ్లు కదలకుండా ఎక్కడెక్కడ మంటలు పెట్టాలా అన్న విద్యలో నారా చక్రవర్తి కొత్త రీసెర్చ్ మొదలుపెట్టాడు. 

 

-  నిన్నటివరకు పాల వ్యాపారుల బ్యూరో సమావేశం వరసన జరిగింది. ధూళిపాళ్ల నరేంద్ర దోపిడీని ఎలా కొనసాగించాలన్న అంశంపై తెలుగుదేశం ఏకగ్రీవంగా మద్దతు పలికింది. సంగం, హెరిటేజ్‌ ఇలా వారి దోపిడీ సామ్రాజ్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న తపనే తప్ప ప్రజల్ని ఎలా బ్రతికించాలన్న ఆలోచన ఏ కోశాన లేదు.

 

- గత ఏడాది కోవిడ్ నుంచి ఇదే పంథాలో ప్రభుత్వం ముందుకు పోతోంది. రెండో వేవ్‌లోనూ దానిని ఎదుర్కోవడంలో ఎపి ప్రభుత్వం ముందుంది. ఇంత జరుగుతున్నా రోజూ పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దానికి కారణం ఈ వైరస్‌కు వున్న వేగం, దానిని ఎదుర్కోనేందుకు అవసరమైన అన్ని శక్తులు మన వద్ద లేకపోవడం. అయినా కూడా ఉన్న పరిమితులకు అనుగుణంగా ఉత్తమమైన విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. 

 

*చంద్రబాబు సర్టిఫికేట్ అవసరం లేదు*

- ఈ రోజు మనరాష్ట్రంలోని ప్రతిపక్షనేత చంద్రబాబు తెలుగుదేశం పోలిట్ బ్యూరో మీటింగ్ ను జూమ్ కాన్ఫెరెన్స్‌లో నిర్వహించారు. ప్రవాసాంధ్రుడుగా తెలంగాణలో వుండే చంద్రబాబు జూమ్‌ మీటింగ్‌లో ఈ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో కూర్చుని తన పార్టీ శ్రేణులకు ఫత్వాలు జారీ చేయడం, ఉపదేశాలు ఇవ్వడం చేస్తున్నాడు. ప్రతి దానిని రాజకీయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నుంచి ఈ ప్రభుత్వం ఎటువంటి సర్టిఫికేట్లు ఆశించడం లేదు. అధికారంపోయిన తరువాత ఆ వియోగంతో ఆయన మానసిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికల వరుస దెబ్బలతో ఇంకా దారుణంగా తయారయ్యాడు. 

 

-  తన భయాన్ని ప్రపంచ భయంగా మార్చేకంటే.. కరోనా నిరోధాన్ని ఏడాది కాలంగా ప్రతిపక్ష నాయకుడిగా ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయన చేసింది ఏముంది? రోజూ జూమ్‌ మీటింగ్‌లు పెట్టి... సామాజిక వర్గాల్ని, ఆర్థిక వర్గాల్ని ఎవరిని కుదిరితే వారిని రెచ్చగొట్టాలన్న తపన, తాపత్రయమే కనిపిస్తోంది.  

 

-  రాష్ట్రంలో కోవిడ్ వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో ఖచ్చితంగా దానిని ప్రతిపక్షంగా సమీక్షించి, ఈ ప్రభుత్వం చేస్తున్న దానిలో ఏవైనా లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపాలి. కానీ దానికి భిన్నంగా చంద్రబాబు మాట్లాడాడు. వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతూ ఎందుకు వ్యాక్సినేషన్ చేయడం లేదు? ప్రజలను గాలికి వదిలేశారు... కేబినెట్‌లో దానిపై ప్రాధాన్యతగా చర్చించలేదని సన్నాయి నొక్కులు నొక్కారు. చంద్రబాబు చెబుతున్నది ఏదైనా రిలవెంట్‌గా వుంటే... దానిని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా స్వీకరిస్తుంది.  సీఎం శ్రీ వైయస్ జగన్ దానిని పాజిటీవ్‌గా తీసుకుంటారు. 

 

- కానీ నలబై ఏళ్ళ రాజకీయ చరిత్ర, పద్నాలుగేళ్ళు సీఎంగా వున్న చంద్రబాబుకు వ్యాక్సినేషన్ తయారీ, దాని సరఫరా ఎవరి నియంత్రణలో వుందో తెలియదా? పూర్తిగా  కేంద్రం నియంత్రణలో వుందని అవగాహన లేదా? రోజుకు ఆరు లక్షల మందికి వాక్సినేషన్ చేసే సామర్థ్యం ఈ రాష్ట్రానికి ఉంది.   ఆ లెక్కన నలబై అయిదు పైబడిన వయస్సు కేటగిరి వారికి ముప్పై అయిదు రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయవచ్చు. ఈ దేశంలో తయారు అయ్యేవి రెండు వాక్సిన్లు. కొత్తగా మరోకటి వస్తోంది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల ఉత్పత్తి, పంపిణీని కేంద్రం నియంత్రిస్తోంది. ఆ సంస్థలు తయారు చేసిన వాటిలో యాబై శాతం కేంద్రంకు ఇవ్వాలి, మిగిలిన యాబైశాతం కేంద్రం నిర్ధేశించిన మేరకు రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది.

 

*4 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు కావాలని ఇండెంట్ పెట్టాం*

- వ్యాక్సిన్‌ కోసం అన్ని రాష్ట్రాలు కేంద్రంపైనే ఆధారపడ్డాయి. ఎపికి 4 కోట్ల డోసులు కావాలని ఇండెంట్ పెట్టాం. మే నెలకు 9 లక్షల డోసులు కేటాయించారు. వ్యాక్సిన్‌ల కోసం డబ్బు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఇంత స్పష్టంగా ప్రభుత్వ విధానం వుంది. కానీ గత పదిరోజులుగా వ్యాక్సిన్ ఎందుకు వేయడం లేదని చంద్రబాబు అడుగుతున్నారు. ఈ ప్రశ్న ఎవరికి అడగాలి?  మొన్నటి వరకు భాగస్వామిగా వున్న బిజెపిని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకు కేంద్రానికి లేఖలు రాయడం లేదు. సీఎం శ్రీ వైయస్ జగన్ కేంద్రం నుంచి వ్యాక్సిన్‌, ఆక్సీజన్‌ కేటాయింపుల కోసం సంప్రదింపులు చేస్తున్నారు. లేఖలు రాస్తున్నారు.  

 

*ఎంత ఖర్చు అయినా వ్యాక్సిన్ కోసం భరిస్తాం*

 

- ఇవ్వన్నీ తెలియనట్లు... రాష్ట్రం పరిధిలో లేని వ్యాక్సిన్ గురించి ఏ దురుద్దేశంతో చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు? చంద్రబాబు చేస్తున్న విమర్శలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కేబినెట్ లో వ్యాక్సిన్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదని అంటారా? ఎంత అయినా సరే వ్యాక్సిన్‌ కోసం ఖర్చుకు ఈ ప్రభుత్వం సిద్దంగా వుంది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, సంక్షేమం తప్ప మరో ధ్యాస శ్రీ వైయస్ జగన్ కి లేదు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అలాగే పనిచేస్తున్నారు . అయినా చంద్రబాబు,ఆయన అనుచరగణం, వారికి వత్తాసు పలికే తప్పుడు మీడియా ఈ ప్రభుత్వంపై ఇదే రకంగా బుదరచల్లడం, మేం ఖండిస్తూనే వున్నాం.

 

- కరోనా రాగానే 104 కి ఫోన్ చేస్తే అంబులెన్స్‌లు వస్తాయి, సహాయం అందుతుంది. లక్షల రూపాయల భారం పడదనే భరోసా శ్రీ వైయస్ జగన్ గారు కల్పించారు. మీ హయాంలో ఇదే పరిస్థితి వస్తే, రాష్ట్రం పరిస్థితి భయంకరంగా వుండేది. జగన్ గారు ముందుచూపుతో నాడు-నేడు కింద ఆసుపత్రులను, అంబులెన్స్‌లను తీసుకువచ్చారు. రోజుకు ఆరు లక్షల వాక్సినేషన్లు చేయగలుతామంటే... కిందిస్థాయిలో అటువంటి వ్యవస్థను సీఎంగారు సిద్దం చేశారు. రెమెడిసివర్ వంటి మందులు కూడా కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆక్సిజన్‌ను కూడా అందుబాటులో పెడుతున్నాం. ఇలా చేయడం వల్లే డబ్బుతో సంబంధం లేకుండా సామాన్యుడు కూడా కోవిడ్ వైద్యం పొందే పరిస్థితి ఏర్పడింది.

-  ఈ విపత్తు మొదలైనప్పటి నుంచి రోజువారీ డేటా ఇస్తున్నాం. గత సెప్టెంబర్, అక్టోబర్ లో రెండు వందల కోవిడ్ ఆసుపత్రులు వుంటే, ఈ రోజు 630 వరకు పెంచారు.  ఈ 10 రోజులులోనే 27 వేల నుంచి 45 వేల బెడ్స్ పెంచాం. ఆక్సీజన్ బెడ్‌లు గతనెల 25వ తేదీనాటికి 19 వేలు వుంటే, నిన్నటికి 29వేలకు  పెంచాం.  సంఖ్యను గణనీయంగా పెంచుతున్నాం. యాబై నుంచి 85 కోవిడ్ కేర్ సెంటర్లను పెంచాం. ప్రస్తుతం 450 టన్నుల ఆక్సీజన్ అందుబాటులో వుంది. ఆర్‌ఐఎన్‌ఎల్ రిజర్వ్ నుంచి కూడా తీసుకుంటున్నాం. అలాగే  క్రయోజనిక్ ట్యాంకులు తెప్పిస్తున్నాం. యుద్దప్రాతిపాదికన ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆక్సీజన్ తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

- వ్యాక్సిన్లు, ఆక్సీజన్ అనేవి కేంద్రం సపోర్ట్ లేకుండా సొంతగా సమకూర్చుకునే పరిస్థితి ఏ రాష్ట్రానికి లేదు. ఆక్సీజన్ కోసం 70 క్రయోజనిక్ ట్యాంకర్లు వస్తే, మనకు ఒకటి కూడా రాలేదు. దానిని కేంద్రం నుంచి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్టోరేజీ కోసం నిర్మాణాలు, నైట్రోజన్ నుంచి కూడా ఆక్సీజన్ తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. కోవిడ్ కేర్ సెంటర్ల వద్ద ఆక్సీజన్ పెడితే వత్తిడి తగ్గుతుందని భావిస్తున్నాం. అవసరమైతే పైప్‌లైన్ ద్వారా ఆక్సీజన్ అందించే ఆలోచన చేస్తున్నాం. ఆక్సీజన్ సిలెండర్ దొరికితే ఇళ్ళలో కూడా పెట్టి వైద్యం చేయవచ్చు. ఆక్సీజన్  సిలెండర్ అనేది ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఇది వాస్తవం. 

 

- ఈ రోజు కర్ఫ్యూ వల్ల పనులు లేక, రెక్కల కష్టంపై బతికే వారు రోడ్డున పడతారు. వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో జగన్ గారు ముందుచూపుతో పనిచేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నగదు బదిలీ కష్టకాలంలో పేదలకు బాగా ఉపయోగపడుతోంది. సీఎంగారి దూరదృష్టి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలపై ఆయన ప్రణాళికలు ప్రజల్లో భరోసా కలిగిస్తున్నాయి. ప్రజలకు ఉచితంగా రేషన్ ఇస్తున్నాం. ఈ నెలలోనే రైతుభరోసా, బీమా ఇస్తున్నాం. అలాగే ఈ సీజన్ లో లక్ష మంది మత్స్యకారులకు ఇచ్చే రూ.పదివేల చొప్పున సాయంను ఈ నెలలోనే ఇస్తున్నాం. ఇవి ఆ కుటుంబాలకు మేలు చేస్తాయి. జగనన్న వున్నాడు, ఆయన మా సంక్షేమం చూసుకుంటాడు, రోగం వస్తే ఆయన ఆసుపత్రిలో చేరుస్తాడు అనే భరోసా కల్పిస్తున్నాయి.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top