వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపునకు కుట్ర

ఉరవకొండలో టీడీపీ నేతల కుట్ర బహిర్గతం

ఎన్నికల అధికారులకు  వైయస్‌ఆర్‌సీపీ నేతల ఫిర్యాదు

సైబర్‌ క్రైమ్‌ కింద టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలి

వైయస్‌ఆర్‌సీపీ నేత విశ్వేశ్వరరెడ్డి

అనంతపురం: వచ్చే ఎన్నికల్లో ఓటమి చెందుతామనే భయం, అసహనంతో టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారు. వైయస్‌ఆర్‌సీపీ చెందిన వారి ఓట్లను తొలగించడానికి  తప్పుడు చర్యలకు పాల్పడుతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో అధికార పార్టీ నేతలు రోజురోజుకు బరి తెగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ నేతల కుట్రను ఆయన వెల్లడించారు. ఉరవకొండలో  2వేల ఓట్లు తొలగించాలంటూ తమ పార్టీ నేతల పేర్లతో ఎన్నికల సంఘానికి  తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆయన తెలిపారు.  టీడీపీ శ్రేణులు చేస్తున్న ఈ  కుట్రపై  ఎన్నికల అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి ఇటువంటి తప్పుడు ఫిర్యాదులను తిరస్కరించాలని ఆయన కోరారు. తప్పుడు ఫిర్యాదులు చేసిన టీడీపీ నేతలపై సైబర్ క్రైం కింద  కేసులు నమోదు చేయాలని వైయస్‌ఆర్‌సీపీ నేత విశ్వేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు.

Back to Top