సుఖీభవ పేరెత్తే అర్హత బాబుకు లేదు

ఐదేళ్లుగా అన్నదాతలను నిలువునా ముంచారు

తొలి సంతకం విలువను చంద్రబాబు దిగజార్చాడు

రుణమాఫీ పేరుతో రైతుకు తీరని అన్యాయం చేశారు

రైతుకు పెట్టుబడి సాయం అందించాలని ఆలోచించిన మొదటి వ్యక్తి వైయస్‌ జగన్‌

వైయస్‌ జగన్‌ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు

ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీని రైతులు నమ్మరు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి

విజయవాడ: అన్నదాత సుఖీభవ అనే అర్హత చంద్రబాబుకు లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను దుర్భిక్ష ఆంధ్రప్రదేశ్‌గా మార్చి లక్షలాది రైతు కుటుంబాలు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లి దినసరి కూలీలుగా పనిచేయాల్సిన దుస్థితిని చంద్రబాబుకు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ అంటూ వంచన చేశాడని మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నాగిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.  

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి సంతకం ఉచిత విద్యుత్‌ పెట్టి దాన్ని సక్రమంగా అమలు చేశారన్నారు. సంక్షేమం చూసి ఓటేయండి అని మళ్లీ ఎన్నికలకు వెళ్లిన నాయకుడు వైయస్‌ఆర్‌ అని గుర్తు చేశారు. అభివృద్ధి చూపించి ఎన్నికలకు వెళ్లే దమ్ము చంద్రబాబుకు ఉందా..? అని ప్రశ్నించారు. వలస కూలీలుగా మారిన రైతులను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని రైతులపై కపట ప్రేమ కురిపిస్తుందని మండిపడ్డారు. ప్రతిపక్షనేతగా 2012లో పాదయాత్ర చేసి అనంతపురం ప్రజల కష్టాలతో నా గుండె కరిగిపోయిందన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేశారని ధ్వజమెత్తారు.  

ప్రమాణస్వీకారం చేయకముందే తన అనుకూల పత్రికలు, మీడియాలో వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం పెడతానని చెప్పి, తొలి సంతకానికి విలువ లేకుండా చేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు. రూ. 87,612 కోట్లు వ్యవసాయ రుణాలు ఉంటే దాన్ని కోటయ్య కమిటీ, రకరకాల కమిటీల పేరుతో రూ. 24 వేల కోట్లకు తీసుకొచ్చి రుణమాఫీ మొత్తం చేశామని ఇవాల్టికీ పచ్చ మీడియాలో చెప్పుకుంటున్నారన్నారు. ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లాలో రుణమాఫీ కాక దంపతులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒక్క సంవత్సరం ఖరీఫ్‌లో 13 లక్షల 66 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, రూ. 3 వేల కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాలని చంద్రబాబు అనుకూల పత్రికలోనే వచ్చిందన్నారు. గత సంవత్సరాలకు సంబంధించి ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌లు రూ. 15 వందల కోట్లు  ఉంటే ఇప్పటి వరకు రైతుల బాకీలు చెల్లించలేదన్నారు.  

మొక్కజొన్న, జొన్న పంటలకు క్వింటాల్‌కు రూ. 2 వందల ప్రోత్సాహం అందిస్తామని చెప్పి ఇవాల్టికి  వరకు ఒక్క రూపాయి చెల్లించలేదన్నారు. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడికి కిలోకు రూ. రెండున్నర ఇస్తామన్నారు ఇప్పటి రూపాయి లేదు. సుబాబులు, జామాయిలుకు ధర పెంచుతామని ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నారు. చంద్రబాబు తొలి సంతకం పెద్ద మోసంతో అయిపోయింది. తాత్కాలిక బడ్జెట్‌లో రైతులకు మళ్లీ మోసం చేయాలనుకుంటున్నారు. అన్నదాత సుఖీభవ అనే అర్హత తెలుగుదేశం పార్టీకి ఉందా..? అని ప్రశ్నించారు. 

రైతుకు పెట్టుబడి సాయం అందించాలని ఆలోచన చేసిన మొదటి వ్యక్తి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని నాగిరెడ్డి అన్నారు. ఆ తర్వాతే తెలంగాణ, ఒడిశా, కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించాయని చెప్పారు. మే నెలలో రూ. 12500లు అందిస్తామని వైయస్‌ జగన్‌ రెండేళ్ల క్రితమే చెప్పారన్నారు. రైతులను దుర్భిక్షులుగా మార్చి సుఖీభవ అని పేరు పెట్టడంలో రైతులను మరోసారి వంచన చేసే కార్యక్రమం జరుగుతుందన్నారు. కేంద్రం ఇస్తామన్న రూ. 6 వేలకు రాష్ట్రం రూ. 4 వేలు కలిపి రూ. 10 వేలు ఇస్తామని మరో కుట్రకు తెరలేపారన్నారు. ఎన్నికల సమయంలో రైతుల కుటుంబాలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని, ఇంత దుర్భిక్ష పరిస్థితుల్లో కూడా రైతు వ్యవసాయం చేయడం మానడం లేదన్నారు. 

 

వైయస్‌ జగన్‌ రెండేళ్ల క్రితమే ప్రకటించిన పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని నాగిరెడ్డి అన్నారు. పసుపు కుంకుమ పేరుతో వంచన, రూ. 5 వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అంగన్‌వాడీలకు జీతాలు చెల్లించలేదు. ఉపాధి హామీ కూలీలను కూడా వంచన. ఆరోగ్యశ్రీ పథకం మీద ఉక్కుపాదం ఇలా అన్నింటిని చంద్రబాబు నాశనం చేశాడన్నారు. 60 శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరువు తాండవం ఆడుతుందన్నారు. రైతులను రూ. 4 వేలతో వంచన చేయొచ్చు అని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారన్నారు. ఐదేళ్లుగా వంచనకు గురైన రైతులు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. 

 

Back to Top