బీసీలకు చంద్రబాబు అన్యాయం..

ఓట్లు కోసమే బీసీలను వాడుకుంటున్నారు..

వైయస్‌ఆర్‌సీపీ బీసీ గర్జనను విజయవంతం చేయాలి...

వైయస్‌ఆర్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి

విజయవాడ: రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని వైయస్‌ఆర్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బీసీలను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారన్నారు.బీసీల అభివృద్ధికి, వారి జీవన ప్రమాణస్థాయిలను పెంచడానికి వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏడాది క్రితమే బీసీ అధ్యయన కమిటీ వేశారన్నారు. బీసీ నేత జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అధ్యయన కమిటీ 13 జిల్లాల్లో పర్యటించి, అన్నివర్గాల బీసీ కుల వృత్తులవారిని కలిసి.. వారి సమస్యలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిందన్నారు.

వచ్చేనెల ఫిబ్రవరి 17న బీసీ గర్జనలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఏవిధంగా మేలు చేయబోతున్నామో..బీసీ డిక్లరేషన్‌ చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం చేయడానికి దశ,దిశా నిర్ణయించబోతున్నామన్నారు. బీసీ గర్జనను విజయవంతం చేయాలని కోరారు.

Back to Top