మీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి

జలయజ్ఞం.. ధనయజ్ఞం అన్న నోటితోనే.. నీరు మేమే తీసుకొచ్చామంటున్నారు

కృష్ణా జలాలు పులివెందులకు తీసుకొచ్చిన ఘనత వైయస్‌ఆర్‌దే

కడప జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది మహానేత

పులివెందుల బిడ్డ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది

వైయస్‌ఆర్‌ సీపీ కడప పార్లమెంట్‌ అభ్యర్థి వైయస్‌ అవినాష్‌రెడ్డి

పులివెందుల: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2004 నుంచి 2009 వరకు కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కడప పార్లమెంట్‌ అభ్యర్థి వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. పులివెందల నుంచి అన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా, తనను ఎంపీగా గెలిపిస్తే ..మీ రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. నామినేషన్ కు ముందు పులివెందులలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. 2004 ఎన్నికల ముందు వైయస్‌ఆర్‌ ఇదే మైదానంలో మీటింగ్‌ పెట్టి స్పష్టంగా చెప్పారు. కృష్ణా నీటిని పులివెందులకు తెచ్చితీరుతానని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ముఖ్యమంత్రి అయిన తరువాత పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ 44 వేల క్యూసెలకు పెంచి 95 శాతం పనులు పూర్తి చేయించారు. పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకు, గండి కోట నుంచి చిత్రావతికి రూ. 1190 కోట్లు ఖర్చు చేశారు. గండికోట నుంచి పైడిపాలెంకు రూ. 667 కోట్లు ఖర్చు చేశారు. ఆ రోజు వైయస్‌ఆర్‌ ప్రాజెక్టులు కట్టేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జలయజ్ఞం కాదు.. ధనయజ్ఞం అని విమర్శించారు. కానీ ఈ రోజు అదే కాల్వల నుంచి నీళ్లు వస్తుంటే తామే చేశామని చెప్పుకుంటున్నారు. ఇది సిగ్గుచేటు కాదా చంద్రబాబూ..? 

ఒక అబద్దాన్ని వెయ్యి సార్లు చెప్పినా‡వైయస్‌ఆర్‌ కృష్ణా జలాలు పులివెందులకు తెచ్చారని ఎవరూ మర్చిపోరు. ప్రాజెక్టులే కాకుండా పరిశ్రమలు, జేఎన్టీయూ, ట్రిబుల్‌ఐటీ వంటి విద్యాసంస్థల విషయంలో, దాదాపు 6 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఐజీకాల్‌ నుంచి నిర్మించారు. పరిశ్రమలు ఐజీకాల్‌లో పెట్టుకునే వెసులుబాటు ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి కంపెనీలు తెచ్చే మనస్సు లేక, పులివెందుల మీద ప్రేమ లేక ఐజీకాల్‌ బిల్డింగ్స్‌ మొండి గోడలుగా మిగిలిపోయాయి. మూడేళ్ల క్రితం వైయస్‌ జగన్‌ ఐజీకాల్‌లో ప్రతి అణువు తిరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అయినా ప్రభుత్వం చేసిందేమీ లేదు. 

రాబోయే రోజులు పులివెందులకు పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలన్నా.. విద్యా సంస్థలు రావాలన్నా.. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి ప్రతి ఎకరాకు నీరు అందాలన్నా.. పులివెందుల బిడ్డ వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుందని ప్రజలందరూ గ్రహించాలి. ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరుగబోతున్నాయి. వైయస్‌ జగన్‌ను ఎమ్మెల్యేగా, ఎంపీగా తనను తిరుగులేని ఆధిక్యతను ఇచ్చి రాష్ట్రం మొత్తం మనవైపు చూసేలా చేయాలని పేరు పేరున మనవి చేసుకుంటూ.. మీ రుణం తీర్చుకునే అవకాశం కచ్చితంగా ఇస్తారని కోరుకుంటున్నానని వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు.  

   
Back to Top