చంద్రబాబు  ఢిల్లీ పర్యటన ఆత్మస్తుతి, పరనిందలా ఉంది..

వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ సుధాకర్‌ బాబు 

టీడీపీ అధికారంలోకి వచ్చి నెలరోజులైంది.

ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

చంద్రబాబు కేంద్ర మంత్రులను కలవడాన్ని ఆహ్వానిస్తున్నాం.

అదే టైంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రతి హక్కును సాధించాలని డిమాండ్ చేస్తున్నాం. 

చంద్రబాబు కేంద్రాన్ని ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు.

చంద్రబాబును నిలదీసిన వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ సుధాకర్‌ బాబు 

ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచిందే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 

ఎన్డీయేలో మీ సహచరుడు నితీష్ కుమార్ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నప్పుడు మీరెందుకు అడగడం లేదు చంద్రబాబు.

చంద్రబాబు ఇప్పుడు ఎన్టీయే కూటమిలో చక్రం తిప్పుతున్నారు.

ఇప్పుడే హోదా సాధించుకునే శక్తి ఉందని ప్రజలూ నమ్ముతున్నారు.

ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు.

టీడీపీకి ఓట్లు వేయలేదన్న కారణంతో పెన్షన్లు నిలిపివేయడం సరికాదు.

పెన్షన్ రావాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కాళ్లు పట్టుకోవాలా? 

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను కొట్టినా, తిట్టినా, కేసులు పెట్టినా ప్రశ్నించే గొంతులు లేస్తూనే ఉంటాయి.

సూూపర్ సిక్స్ తో పాటు, ఎన్నికల ప్రచారంలో మీరు చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చేదాకా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గళమెత్తుతాయి.

మాజీ ఎమ్మెల్యే పీజీఆర్ సుధాకర్‌ బాబు.

తాడేపల్లి. చంద్రబాబు  ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ప్రెస్ మీట్ లో ఆత్మస్తుతి పరనింద కనిపించందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పీ జే ఆర్ సుధాకర్‌ బాబు ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి నెలరోజులైందని, వారు ప్రజలకిచ్చిన హామీలు అమలు కోసం ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఆశగా చూస్తున్నారని ఆయన అన్నారు. శుక్ర‌వారం సుధాక‌ర్‌బాబు
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

సుధాక‌ర్‌బాబు ఇంకా ఏమన్నారంటే… 
చంద్రబాబు గొప్ప పరిపాలన అందిస్తారన్న నమ్మకంతో ప్రజలు ఆయనకు గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే… బాబు మాత్రం ఎన్నికల్లో చెప్పిన అబద్దాలనే మరోసారి ప్రధానమంత్రి చెప్పినట్లు ప్రెస్ నోట్‌ విడుదల చేయడంపై సుధాకర్‌ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

గత ప్రభుత్వంలో పరిపాలన సక్రమంగా చేయలేదని… పాడిన పాటే పాడుతూ చంద్రబాబు జగన్మోహనరెడ్డిగారిని మర్చిపోలేకపోతున్నారన్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రమంత్రులను కలవడం, వారి భాగస్వామ్య పార్టీకు చెందిన కేంద్ర మంత్రులను కలవడాన్ని ఆహ్వానిస్తున్నామన్న సుధాకర్‌ బాబు, ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి రావాల్సిన ప్రతి హక్కును సాధించుకురావాలవి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. 

సీఎం చంద్రబాబు పత్రికా ప్రకటనలో రాష్ట్రానికి ఆర్ధిక లోటు ఇవాళ కొత్తగా ఉందన్నట్టు వ్యక్తీకరించడంతో పాటు పోలవరానికి జాతీయ హోదా కల్పించమని మళ్లీ మొదటి నుంచి అడుగడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు విడుదల,  పారిశ్రామిక సదుపాయాల కోసం సహాయసహకారాలు అందించడం వంటి పలు అంశాలను ప్రస్తావించిన చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. 
విభజన హామీలలో పొందుపరిచిన రాయలసీమ, ఉత్తరాంధ్రాకు బుందేల్ ఖండ్ తరహాలోనే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విభజన హామీలలో ఉందని… అది 2014-19లో కూడా కేంద్రంలో బీజీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అడిగినా అమలు కాని విషయాన్ని గుర్తు చేసారు.

ఈ నేపధ్యంలో ఇవాళ చంద్రబాబు అడిగిన అంశాలను ఆహ్వానిస్తూనే.. కేంద్రాన్ని ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదని సుధాకర్‌ బాబు ప్రశ్నించారు. ఆంధ్రరాష్ట్రాన్ని మరలా గట్టెక్కించడానికి ప్రధానమైన అస్త్రమేదైనా ఉందంటే… అది ప్రత్యేక హోదా మినహా మరే మార్గం లేదన్న విషయాన్ని గుర్తు చేసారు. 
అదే సమయంలో ఎన్టీయే మరో భాగస్వామి  అయిన నితిష్ కుమార్ తన పార్టీ సమావేశంలో ప్రధానమైన డిమాండ్ అయిన ప్రత్యేకహోదాను బీహార్‌కు ఇవ్వాలని కోరుతూ.. కీలక అంశాన్ని లేవనెత్తారని… అంతే దైర్యంతో చంద్రబాబు నాయుడు కూడా ఆ డిమాండ్ చేయాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కోరుకుంటున్నామన్నారు.

2014-19 మధ్య కాలంలో కూడా ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలుగా చాలా సఖ్యతతో ఉన్నారు. ఆ కాలంలో పలుమార్పు ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా డిమాండ్ చేసిన మీరు చిట్టచివరికి ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు లోంగిపోయారని ప్రశ్నించారు. 
విభజన హామీలన్నీ చంపేసి ప్యాకేజీ తీసుకుని… సరిగ్గా 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు బీజేపీ, నరేంద్ర మోదీపై చంద్రబాబు  తిరుగుబాటు చేసి, అనంతరం  ఎన్నికల్లో ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 
 ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైయ‌స్ జ‌గ‌న్‌ వైపు వేలు చూపించిన పరిస్థితుల్లో… ప్రత్యేక హోదా సాధించడానికి బీజేపీకి నా అవసరం లేదు, బీజీపీ కనుక వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మీద ఆధారపడితే అప్పుడు  నా డిమాండ్లను వారు నెరవేర్చడానికి ఆస్కారం ఉంటుందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్‌  చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తన ప్రతి ఢిల్లీ పర్యటనలో ప్రత్యేక హాదా అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని గుర్తు చేసారు.
హోదా అంశాన్ని సజీవంగా ఉంచిందే జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. హోదాతో రాష్ట్రానికి మేళ్లు జరుగుతాయని బలంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి నమ్మాడన్నారు. 

ఈ రోజు అదే ప్రధానమంత్రి, అదే బీజీపీతో కూడిన  ఎన్డీయే కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పగా… అందులో మీరు కూడా భాగస్వామ్యులుగా ఉన్నప్పుడు… మీ సహచరుడు నితీష్ కుమార్ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నప్పుడు మీరెందుకు అడగడం లేదన్న విషయాన్ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రశ్నిస్తున్నామన్నారు. 

చంద్రబాబు ఇప్పుడు ఎన్టీయే కూటమిలో చక్రాన్ని బాగా తిప్పగలుగుతున్నారని… హోదా సాధించుకునే శక్తి ఉందని… ప్రజలు కూడా ఇదే విషయాన్ని నమ్ముతున్నారని సుధాకర్‌ బాబు స్పష్టం చేశారు. మీ అధికారాన్ని దుర్వనియోగం చేసుకోవద్దని సూచించారు. 4.12 కోట్ల మంది ఓటర్లు ఉంటే… మీకు 1,53, 84,576 మంది ఓట్లేయగా… 1,32,84134 మంది ఓట్లేశారు. మాక్కూడా 40 శాతం మంది ఓట్లేశారు. ఎవరికి ఓట్లేసినా అందరూ ప్రజలే… ఆ ఆలోచనతోనే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తన సంక్షేమ పథకాల అమల్లోనూ, సంస్కరణల్లోనూ పార్టీల ప్రస్తావన చేయలేదన్నారు. 
 
ఇవాళ అధికారం వస్తే ఏం చేయవచ్చు.. ప్రతిపక్ష పార్టీ వాళ్లమీద కేసులు ఎలా పెట్టవచ్చు, దాడులు, దోపిడీలు, దౌర్జన్యాలు ఎలా చేయవచ్చో, కట్టుకున్న బిల్డింగులు ఎలా కూల్చవచ్చో తెలుగుదేశం పార్టీ నెలరోజుల్లోనే చూపించారని సుధాకర్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
అయితే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ఆ పాలసీని నమ్మలేదని…  అందుకే టీడీపీ,బీజీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఏ పార్టీ కార్యకర్తలైనా పూర్తిగా సంక్షేమ ఫలాలు అనుభవించారన్న విషయాన్ని గుర్తు చేశారు.
మీకు ప్రజలు అధికారమిచ్చిందని దాడులు చేయడానికో, బిల్డింగులు కూలగొట్టడానికే, విపక్ష పార్టీ నేతల ఆస్తులను ధ్వంసం చేయడానికో కాదన్న విషయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ మోహన్ రెడ్డి కూడా స్పష్టం చేశారన్న విషయాన్ని సుధాకర్‌ బాబు మరోసారి గుర్తు చేసారు. నవరత్నాల హామీలను పూర్తిగా అమలు చేశామన్నారు. 

ఇవాళ అధికారతెలుగుదేశం పార్టీ ఇచ్చిన రూ.7వేల పెన్షన్ హామీను అమలుచేస్తూ... అందులోనూ వివక్ష చూపిస్తోందని సుధాకర్ బాబు ఆక్షేపించారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదన్న కారణంతో కొంతమందికి ఈ పథకాలును  ఎందుకు అమలు చేయడం లేదన్నారు.
అది కూడా గరిష్టంగా దళితబిడ్డలకే ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. అంటే ప్రజలకు హక్కుగా రావాల్సిన  పెన్షన్ రావాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కాళ్లు పట్టుకోవాలా ?  అని ప్రశ్నించారు. 
ఆ రకమైన వాతావరణాన్ని ఎందుకు తీసుకోచ్చారో సమాధానం చెప్పాలన్నారు. పథకాల అమల్లో వ్యత్యాసాలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రధానమైన హామీలు చూస్తే… ఇంటిలో ఎంతమంది పిల్లలంటే అందరికీ తల్లికి వందనం పేరుతో రూ.15వేలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటి మంది పిల్లలకు ఎప్పుడిస్తారని అడిగారు. 
మరోవైపు  ఖరీప్ సీజన్లో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టుకోవాలి. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తొలివిడతగా రైతుకు అందాల్చిన పెట్టుబడి సాయం  ఇప్పటికే అందించిన పరిస్థితి ఉంటే… ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు సాయం అందించలేదో సమాధానం చెప్పాలన్నారు. తక్షణమే రైతులకు సాయం అందించాలని డిమాండ్ చేశారు.

18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తానని మాటిచ్చారు. రికార్డుల ప్రకారం సుమారు 2.10 కోట్ల మంది ఆడపడుచులు ఉన్నారు. వీరికి నెలకి రూ.1500 చొప్పున ఇస్తే చూడాలని ఆశపడుతున్నామన్నారు. వాలంటీర్లకు రూ.5 వేలు కాదు రూ.10 వేలు ఇస్తామన్నారు. కానీ ఒకటో తేదీన వాలంటీర్లను పక్కనపెట్టి సచివాలయ సిబ్బందితో పెన్షన్ పంపిణీ చేసారు. అంటే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  స్ధాపించిన సిబ్బందితోనే పెన్షన్ పంపిణీ జరిగిన విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. 

టీడీపీ నేతలు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు పంపిణీ చేయలేమా అన్నారు. ఇప్పుడు మీరు పెన్షన్ పంపిణీకి వినియోగించిన వారిలో 80 శాతం మంది అంటే 1.25 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి నియమించిన సచివాలయ సిబ్బందే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.   
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన మంచి పనులను తీసివేసి ఒక్క అడుగు కూడా వేయడానికి టీడీపీకి తావులేదని సుధాకర్‌ బాబు తేల్చి చెప్పారు. టీడీపీ దగ్గర ఉన్నదల్లా దౌర్జన్యాలు, దాడులకు దిగడం, మీ పార్టీకి ఓట్లు వేయలేదు కాబట్టి సంక్షేమ పథకాలు తీసేస్తామని బెదిరించడం మీ పరిపాలన శైలి అయితే మాకు ఓటు వేసినా వేయకపోయినా, ఏ పార్టీకి చెందిన వారు అయినా అందరికీ పథకాలు అందాలని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిఖార్సయిన రాజకీయాలు చేశారన్నారు. 

ఈ నేపధ్యంలో వైయ‌స్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలను కొట్టినా, తిట్టినా, కేసులు పెట్టినా ప్రశ్నించే గొంతులు లేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. మీరు చెప్పిన సూూపర్ సిక్స్ హామీలతో పాటు, ఎన్నికల ప్రచారంలో మీరు చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చేదాకా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గొంతులు ఆంధ్రరాష్ట్రం నలుమూలలా ప్రశ్నిస్తూనే ఉంటాయని తేల్చి చెప్పారు.
నితీష్ కుమార్, చంద్రబాబు ఇద్దరూ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తే… కచ్చితంగా వస్తుందని సుధాకర్‌ బాబు విశ్వాసం వ్యక్తం చేశారు.  ఎన్డీయే ప్రభుత్వం చంద్రబాబు, నితీష్ కుమార్లపై ఆధారపడి ఉన్నప్పుడు.. ఆంధ్రరాష్ట్ర ప్రజల డిమాండ్ ను కచ్చితంగా వింటారని సుధాక‌ర్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Back to Top