కుప్పం ప్రచారంలో దూసుకుపోతున్న వైయ‌స్ఆర్‌సీపీ

చిత్తూరు:  కుప్పం మున్సిపాలిటీలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి స్థానికుల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. కుప్పం ప్రచారంలో వైయ‌స్సార్‌సీపీ దూసుకుపోతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆధ్వ‌ర్యంలో కుప్పం ప‌ట్ట‌ణంలో గురువారం ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. జోరు వాన‌ను సైతం లెక్క చేయ‌కుండా ప్ర‌జ‌లు ప్ర‌చారానికి వ‌చ్చిన నేత‌ల‌ను సాద‌రంగా ఆహ్వానిస్తూ..త‌మ ఓటు వైయ‌స్ జ‌గ‌న్‌కే అంటూ నిన‌దిస్తున్నారు. కుప్పంలో అధికార పార్టీ అభ్యర్థులకు మంచి ప్రజాదరణ లభిస్తుంటే టీడీపీ కనీస ఆదరణకు నోచుకోలేకపోతోంది.  కుప్పం మున్సిపాల్టీని వైయ‌స్సార్‌సీపీ కైవసం చేసుకోవడం ఖాయంగా క‌నిపిస్తోంది.  ఓటమి భయంతనే టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. టీడీపీ అవాస్తవ ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. 
 

తాజా ఫోటోలు

Back to Top