విజయనగరం: ఆల్ ఫ్రీ చంద్రబాబుతో తస్మాత్ జాగ్రత్త గా ఉండాలని వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) సూచించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల పైన చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో గరివిడి పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి చీపురుపల్లి గాంధీ సెంటర్ వరకు జరిగిన బైక్ ర్యాలీలో మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొని ప్రసంగించారు. గత ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయన చంద్రబాబునాయుడు గారు ఈరోజు వైయస్ జగన్ గారు పెద్ద మనసుతో రాష్ట్రంలో సుమారు 33 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే వాటిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు గారు సెంటు స్థలంలో శవాలు పూడ్చుకోవడానికి తప్ప ఏమి ఇల్లు సరిపోతుంది అన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నిన్న మహానాడులో చంద్రబాబునాయుడు గారు ప్రకటించిన మేనిఫెస్టో చూస్తుంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారని వైనయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పథకాలను కాపీ కొట్టారని రాబోయే ఎన్నికలు పేదవాడికి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధమని అన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఎన్నికల సమయాల్లో చంద్రబాబు నాయుడు ఆల్ ఫ్రీ బాబుగా మారిపోతాడని ఎన్నికలు అయినాక ప్రజలను మోసం చేస్తాడని ఈ ఆల్ ఫ్రీ బాబుతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.