చింతమనేని వ్యాఖ్యలపై ఆగ్రహజ్వాలలు

రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ దళిత విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలు
 

అమరావతి: టీడీపీ దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైయస్‌ఆర్‌సీపీ దళిత విభాగం నేతలు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తక్షణమే చింతమనేని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ దళిత విభాగం నేతలు తోకల శ్యామ్, చందు కిరణ్, విజయరాజు, డిమాండు చేశారు. చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేయని పోలీసులు ఏలూరు పార్టీ ఆఫీస్‌కు వెళ్తున్న  అబ్బాయి చౌదరిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. చింతమనేని వ్యాఖలపై ఇంద్రపాలెం అంబేద్కర్‌ విగ్రహం వద్ద టీడీపీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేశారు. కాకినాడ వైయస్‌ఆర్‌సీపీ దళిత విభాగం ఆధ్వర్యంలో పి.గన్నవరం త్రీరోడ్‌ జంక్షన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. చిత్తూరు జిల్లా బి.కొత్తపేటలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో చింతమనేని దిష్టిబొమ్మను దహనం చేశారు. 
 

తాజా ఫోటోలు

Back to Top