మాట ఇస్తే కచ్చితంగా నిలబెట్టుకునే తత్వం వైయ‌స్‌ జగన్‌ ది

 వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ:   మాట ఇస్తే క‌చ్చితంగా నిల‌బెట్టుకునే త‌త్వం వైయ‌స్ జ‌గ‌న్‌ది అని వైయ‌స్ఆర్‌సీపీ ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర‌రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ తరువాత చేనేత కార్మికుల ఇబ్బందులు గుర్తించి వారిని అన్ని విధాలుగా ఆదుకున్న ముఖ్యమంత్రి దేశంలో వైయ‌స్ జ‌గ‌న్‌ ఒక్కరేనని  అన్నారు. వైయ‌స్ఆర్ నేతన్న నేస్తం' పథకం కింద నాలుగో విడత 24 వేల రూపాయలు చేనేత కార్మికుల ఖాతాల్లో జమ అయిన సందర్భంగా శుక్రవారం ఉరవకొండలో నేతన్న నేస్తం లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించే కార్యక్రమంలో విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం చేనేత కార్మికులతో కలిసి సీఎం వైయ‌స్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ..నాడు రుణమాఫీ పేరుతో చంద్రబాబు నేతన్న ను మోసం చేస్తే, పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నేడు 'వైస్సార్ నేతన్న నేస్తం' పథకం కింద 4 వ విడత డబ్బులు జమ చేసి జగన్‌ చేనేతలను ఆదుకున్నారు.ఇప్పటి వరకు మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి రూ.96 వేలు వారి ఖాతాల్లో జమ చేసి అండగా నిలిచారని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.3.52 కోట్లు కూడా జగన్ చెల్లించిన విషయాన్ని గుర్తుకు చేశారు..ఒక్క నేతన్న నేస్తంమే కాకుండా వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించారని చెప్పారు. చేనేతల కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. చేనేతలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని ఆయన చెప్పారు. అన్ని విధాలుగా సాయం అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని చేనేతలు తమ గుండెల్లో ఉంచుకోవాలని మళ్లీ ఆశీర్వదించాలని విశ్వేశ్వరరెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి చందా చంద్రమ్మ, జెడ్పిటిసి ఏసీ పార్వతమ్మ, సర్పంచ్ లలిత, వైస్ ఎంపిపి నరసింహులు,మార్కెట్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ, ఉప సర్పంచ్ వన్నప్ప,కురుబ, బెస్త, ఎంబిసి కార్పొరేషన్ల డైరెక్టర్లు గోవిందు, రమణ,జోగి వెంకటేష్,నేతలు బ్యాంక్ ఓబులేసు, ఏసీ ఎర్రిస్వామి,సింగాడి తిప్పయ్య,మీనుగా బసవరాజు, చేనేత నాయకులు చంగల మహేష్, కొత్తపల్లి హరి, వాసు, నిమ్మల వెంకటరమణ, సాధు కుల్లాయిస్వామి,ఎంసి  నాగభూషణం, మిడతల చంద్రమౌళి, బీరే శివ, కాసుల అంజి, బ్రహ్మయ్య, అమర్నాథ్,కరూర్ వెంకటేష్,రెడ్డి ఆంజనేయులు, పొస రాము, ఆర్సీ ప్రసాద్,నాయకులు బుక్కీట్ల కృష్ణమూర్తి,మీనుగా ఎర్రిస్వామి, ఓబన్న,కంబటి రామాంజనేయులు, అయ్యర్ దాదు,వేమన్న తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top