డేటా చోరీపై కఠిన చర్యలు తీసుకోవాలి

నిజ నిజాలను నిగ్గు తేల్చాలి..

డేటా చోరీ,అక్రమ ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్‌కు వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు

అమరావతి:డేటా చోరీ,అక్రమ ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్‌కు వైయస్‌ఆర్‌సీపీ నేతలు గోపిరెడ్డి శ్రీనివాస్, కాసు మహేష్‌ రెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు ఫిర్యాదు చేశారు. డేటా చోరీపై కఠినచర్యలు తీసుకోవాని పేర్కొన్నారు. టీడీపీ సభ్యత్వం 60 లక్షలకు మించిలేదని, 3 కోట్ల మంది డేటాను ఎలా సేకరిస్తారని ప్రశ్నించారు. ఇది ముమ్మూటికి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డేటా అని పేర్కొన్నారు. డేటా ఎలా లీక్‌ అయిందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఈ డేటాతోనే ఓట్లను తొలగిస్తున్నారని నమ్ముతున్నామన్నారు. నియోజకవర్గాల్లో అక్రమాలు జరిగాయని భావిస్తున్నామని తెలిపారు. ఐటీ గ్రిడ్స్‌ ద్వారా సేకరించిన డేటా ద్వారానే ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వమే అక్రమంగా ఆ డేటా ఇచ్చిందని మండిపడ్డారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top