వైయస్‌ఆర్‌సీపీ సీజీసీ సభ్యునిగా నార్నె

అమరావతి:వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నార్నె శ్రీనివాసరావును పార్టీ కేంద్ర పాలక మండలి(సీజీసీ) సభ్యునిగా నియమించినట్లు వైయస్‌ఆర్‌షీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. సినీ నటుడు నందమూరి తారక రామారావు( జూనియర్‌ ఎన్టీఆర్‌) మామ నార్నే శ్రీనివాసరావు ఇటీవ‌ల వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విష‌యం విధిత‌మే.  ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు దగ్గరి బంధువు. అలాంటి వ్య‌క్తికి వైయ‌స్ జ‌గ‌న్ వైయ‌స్ఆర్‌సీపీలో కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌డంతో నార్నే అనుచ‌రులు, ఎన్టీఆర్ అభిమానులు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Back to Top