అట్టహాసంగా వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

 నందిగం సురేశ్, ఆమంచి చేత రిబ్బన్‌ కట్‌ చేయించిన వైయస్‌ జగన్‌

భారీ సంఖ్యలో హాజరైన నేతలు, కార్యకర్తలు

అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కార్యాలయాన్ని ప్రారంభించారు. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ చేత వైయస్‌ జగన్‌ రిబ్బన్‌ కట్‌ చేయించారు. అనంతరం కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. అంతకు ముందు కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైయస్‌ జగన్‌ పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ గు్రరంపాటి దేవేందర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. 


 

Back to Top