వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల ఘన విజయం

అమరావతి: రాజ్యసభ నాలుగు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వైయస్‌ఆర్‌సీపీ తరఫున డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్‌ నత్వాని ఘన విజయం సాధించారు. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులకు 152 ఓట్లు పోల్‌ కాగా, టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య ఘోర పరాజయం పొందారు. నలుగురు అభ్యర్థులు వైయస్‌ఆర్‌సీపీ తరఫున గెలవడంతో రాజ్యసభలో పార్టీ బలం ఆరుకు చేరింది. గెలుపొందిన అభ్యర్థులను పార్టీ నేతలు అభినందించారు.
 

తాజా ఫోటోలు

Back to Top