కోలాహలంగా  వైయ‌స్ఆర్‌సీపీ  అభ్యర్థుల నామినేషన్లు

అమరావతి : రాష్ట్రంలో వచ్చేనెల 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. వైయ‌స్ఆర్‌సీపీ  నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులంతా గురు, శుక్రవారాల్లోనే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కృష్ణా జిల్లా నూజీవీడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకా ప్రతాప్‌ అప్పారావు, నెల్లూరు జిల్లా ఉదయగిరి అభ్యర్థి మేకా ప్రతాప్‌, నెల్లూరు అభ్యర్థి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ గురువారం నామినేషన్లు దాఖలు చేశారు.   కృష్ణా జిల్లా నూజీవీడు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మేకా ప్రతాప్‌ అప్పారావు ఈ రోజు ఉదయం 11.20 గంటలకు నామినేషన్‌ దాఖలు చేశారు. పట్టణంలోని ద్వారకా ఎస్టేట్ నుండి వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ సమర్పించారు. అవనిగడ్డ అభ్యర్థిగా సింహాద్రి రమేష్‌, పామర్రు అభ్యర్థిగా అనిల్‌ కూమార్‌లు నామినేషన్లు వేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి నామినేషన్‌ వేశారు. పార్టీ కార్యకర్తలు, ఇతర నాయకులతో భారీ ఊరేగింపుగా వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు.

కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ర్యాలీగా వచ్చి నామినేషన్‌ వేశారు.తూర్పు గోదావరి జిల్లా  రాజమండ్రి వైఎస్సార్‌ సీపీ ఎంపీ అభ్యర్థిగా మార్గాని భరత్ నామినేషన్ వేశారు. ముందుగా ద్వారకా తిరుమల లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట జిల్లా అసెంబ్లీ అభ్యర్థులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తులు తరలివచ్చారు. రామచంద్రపురం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గా చెల్లుబోయిన వేణు నామినేషన్ దాఖలు చేశారు.  నెల్లూరు సిటీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ భారీ ర్యాలీగా తరలి వచ్చి నామినేషన్‌ వేశారు. గాంధీ బొమ్మ నుంచి వందలాది మంది కార్యకర్తలతో నామినేషన్‌కు తరలివచ్చారు.

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీమంత్రి కొలుసు పార్థసారధి నామినేషన్ దాఖలు చేశారు. పోరంకి నుంచి పెనమలూరు వరకు భారీ ర్యాలీ తరలివచ్చి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ సమర్పించారు శ్రీకాకుళం టెక్కలి అభ్యర్థి పేరాడ తిలక్‌, రాజాం అభ్యర్థి కంబాల జోగులు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు.  అరకు వైఎస్సార్ సీపీ అభ్యర్థి చెట్టి ఫాల్గుణ భారీ ర్యాలీగా తరలి వచ్చిన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటి రమ్యశ్రీ, విద్యార్థి నాయకులు తేడబారికి సురేష్ కుమార్‌, యూత్ అద్యక్షులు వినయ్‌ రేగ మత్సలింగం,మిథుల తదితరులు పాల్గొన్నారు. బనగానపల్లె వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి నామినేషన్  వేశారు. రామిరెడ్డితో పాటు ఎర్రబోతుల వెంకట్ రెడ్డి, పట్టణ మాజీ సర్పంచ్ లక్ష్మి రెడ్డి, శంకర్ రెడ్డి లు నామినేషన్ కార్యాక్రమనికి వెళ్లారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం పెరిగిపోయాయని రామిరెడ్డి పేర్కొన్నారు. జన్మభూమి కమిటీల అరాచకాలు, ఎమ్మెల్యే దురగతాలు నియోజకవర్గంలో పెరిగిపోయాయని ఆరోపించారు. రాజశేఖర రెడ్డి పాలన లో రైతులకు, మహిళలకు, ప్రతి వర్గం వారికి ఎంతో మేలు జరిగిందన్నారు. వైఎస్సార్‌ రుణం తీర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ని అధికారంలోకి తీసుకురావాలని గ్రామాల్లో ప్రజలు కంకణం కట్టుకున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గం లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమని కాటసాని రామిరెడ్డి ధీమా వ్యక్తం శారు.

కడపలో లోక్‌సభ స్థానానికి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా వైఎస్‌ అవినాష్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం అవినాష్‌ మీడియాతో మాట్లాడుతూ.. రెండవ సారి ప్రజల ఆశిస్సులతో ఎంపీ గా పోటీ చేస్తున్నానన్నారు. ‘నికర జలాల సాధన కోసం పోరాటం తాను పోరాటం చేశానన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశానని మళ్లీ తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కోత్త రైళ్ళను జిల్లాలో నడిపించే విధంగా కృషి చేశానన్నారు. ఆలు లేదు సోలు లేదన్న చందంగా మారిన ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, ప్రత్యేక హోదా, విభజన హమీలు, ఉక్కు పరిశ్రమ వంటి సమస్యలపై భవిష్యత్తులో పోరాటం చేస్తానని తెలిపారు. భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ప్రజలను కోరారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం వైస్సార్‌ సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజన్నదొర నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గురువారం ఉదయం 11 గంటల ముహూర్తం సమయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా నామినేషన్ పత్రాల దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ జరజాపు ఈశ్వర్ రావు మాజీ వైస్ చైర్మన్ పువ్వుల నాగేశ్వరరావు సాలూరు జడ్పిటిసి రెడ్డి పద్మావతి మాజీ మున్సిపల్ చైర్మన్ ముగడ గంగమ్మ తదితరులు హాజరయ్యారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top