వైయ‌స్ఆర్‌సీపీ బస్సు యాత్ర  పోస్టర్ల ఆవిష్కరణ

అమ‌రావతి: సామాజిక న్యాయభేరి పేరుతో వైయ‌స్ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29 వరకు శ్రీకాకుళం టూ అనంతపురం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మంత్రులతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర పోస్టర్లను విడుద‌ల చేశారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి మంత్రి విడుద‌ల ర‌జ‌ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం వర్ధిల్లుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు.  సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీలను అందలమెక్కించారని కొనియాడారు.

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో దాదాపు 75 శాతం బలహీనవర్గాలకే అందుతున్నాయంటే సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం ఎంతగా పరితపిస్తోందో అర్థమవుతోందన్నారు. 25 మంది సభ్యులున్న రాష్ట్ర కేబినెట్‌లో  ఏకంగా 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలే ఉన్నారంటే జగనన్న ఎంత చిత్తశుద్ధితో సామాజిక న్యాయం అమలు చేస్తున్నారో తెలుస్తోందన్నారు.  బీసీల ఉనికి చాటేలా  56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతోందన్నారు. ఈ అంశాలను వివరించేందుకే బస్సు యాత్ర చేపట్టినట్లు మంత్రి చెప్పారు.

Back to Top