ఇది బీసీలకు దక్కిన గౌరవం

ఎమ్మెల్సీ పదవికి జంగా కృష్ణమూర్తి నామినేషన్‌ దాఖలు

అమరావతి: వైయస్‌ఆర్‌సీపీకి దక్కిన ఏకైక ఎమ్మెల్సీని బీసీలకు కేటాయించడం సంతోషకరమని, ఆ ఒక్క స్థానాన్ని తనకు కేటాయించడం బీసీలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని వైయస్‌ఆర్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్‌ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. సోమవారం వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఎమ్మెల్సీ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసే బాధ్యత వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తనకు  ఇచ్చారని జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు.

బీసీలను ఆదుకోవడానికి ఏం చేయాలో అధ్యయనం చేయమన్నారని చెప్పారు.బీసీలకు వైయస్‌ జగన్‌ దేశంలో ఎవ్వరు ఇవ్వనటువంటి డిక్లరేషన్‌ ఇచ్చారని చెప్పారు. బీసీ గర్జనలోనే వైయస్‌ఆర్‌సీపీకి వచ్చిన ఒకే ఒక ఎమ్మెల్సీని బీసీలకు ఇచ్చారని తెలిపారు. ఇది బీసీలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. వైయ‌స్‌ జగన్ మాట ఇస్తే తప్పరని మరోసారి నిరూపించార‌ని తెలిపారు. బీసీని అయిన నన్ను ఇచ్చిన మాట మేరకు ఎమ్మెల్సీని చేశారని పేర్కొన్నారు. నామినేషన్‌ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, ముస్తఫా, ఆదిమూలం సురేష్, మేక ప్రతాప్ అప్పారావు, కంబల జోగులు, రక్షణ నిధి, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, జంకే వెంకట రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top