కుల వృత్తులను నాశనం చేసింది చంద్రబాబే..

రాష్ట్రంలో బీసీల పరిస్థితి దయనీయం..

చంద్రబాబు మోసాలను బీసీలు గ్రహించాలి..

వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి...

విజయవాడ: చంద్రబాబు కులవృత్తులను నాశనం చేశారని వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో బీసీల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 17న నిర్వహించే వైయస్‌ఆర్‌సీపీ బీసీ గర్జనలో బీసీలకు మేలు జరిగేవిధంగా దిశనిర్ధేశం  చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిపాలన దక్షత  కలిగిన మాజీ మంత్రులు, కుల సంఘాల నాయకులతో బీసీ అధ్యయన కమిటీ వేయడం జరిగిందన్నారు. ఈ అధ్యయనంలో అనే వాస్తవాలు వెలుగుచూశాయన్నారు.

రాష్ట్రంలో బీసీ వర్గాల పరిస్థితి దారుణంగా ఉందో లోతైన అధ్యయనం చేశామన్నారు.రాష్ట్రంలో  అన్ని జిల్లాలు పర్యటించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 144 కులాలుగా ఉన్న బీసీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే కనీసం కొన్ని చోట్ల ఉండటానికి నివాస సౌకర్యాలు కూడా లేవన్నారు. సంచార జాతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. బీసీలను మేమే ఉద్ధరిస్తున్నామని పచ్చి అబద్ధాలు చెప్పే చంద్రబాబు...ఈ నాలుగున్నర సంవత్సరాల్లో   బీసీలకు చేసింది ఏమీలేదన్నారు. 1999లో ప్రపంచబ్యాంకు ఒప్పందం పేరుతో కులవృత్తులలో సాంకేతిక పరిజ్ఞానం పేరుతో కులవృత్తులను నాశనం చేయడానికి కార్పొరేట్‌ శక్తులకు ద్వారాలు తెరిశారని గుర్తుచేశారు.

ఇలాంటి చంద్రబాబు కులవృత్తులను పరిరక్షిస్తామని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమే అని ఎద్దేవా చేశారు. కొన్ని ప్రాంతాల్లో సంచార జీవితాలు పరిస్థితి  చాలా దారుణంగా ఉన్నాయని, మేం ఏకులానికి చెందిన వాళ్లమో  తెలియడం లేదని సంచార జాతులు చెప్పడం వారి దయనీయ జీవితాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబు రాజ్యాంగ హక్కులను తుంగలో తొక్కుతున్నారని, అప్రజాస్వామికంగా..అధికారమే ధ్యేయంగా చంద్రబాబు పరిపాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీల గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నా. చంద్రబాబు నాయుడు బీసీలకు చేసిన మోసాలను గ్రహించాలన్నారు. 

 

 

Back to Top