అంబేద్కర్ ఆలోచ‌న‌తో వైయ‌స్ జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌

వైయ‌స్ఆర్‌సీపీ బ‌ద్వేల్‌ ఎమ్మెల్యే దాస‌రి సుధా

వైయ‌స్ఆర్ జిల్లా:  రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఆలోచ‌నా విధానంతో వైయ‌స్ జ‌గ‌న్ గ‌త ఐదేళ్లు పాలించార‌ని, ఆయ‌న ఆశ‌యాల సాధ‌న‌కు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని బ‌ద్వేల్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ దాస‌రి సుధా పిలుపునిచ్చారు.  భారత రాజ్యాంగ పిత డా. బి.ఆర్.అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా బ‌ద్వేల్‌లో ఆయ‌న‌ విగ్రహానికి ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  మన భారత రాజ్యాంగం అన్ని రాజ్యాంగ లో కల్ల అతి పెద్ద రాజ్యాంగం అన్నారు. అంబేద్కర్  పేద, బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారి కోసం పోరాడార‌ని,  ఆయన గొప్ప మానవతా వాది అని తెలిపారు. కార్యక్రమం లో మున్సిపాలిటీ అధ్యక్షులు సుందర రామిరెడ్డి, రాష్ట్ర పార్టీ సగర విభాగం అధ్యక్షులు బంగారు శీనయ్య, జిల్లా కార్యదర్శి  యద్దా రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సాయి కృష్ణ, గోపవరం మండల అధ్యక్షులు  మల్లికార్జున రెడ్డి, అధికార ప్రతినిధి  వెంకటేశ్వర్లు, జే.సి.యస్ కన్వీనర్  పుల్లయ్య,మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్  నాగం సుబ్బారెడ్డి, కౌన్సిలర్స్ , పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.


హిందూపురంలో..

 భారత స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాత, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత, భారతరత్న డా. బి.ఆర్ అంబేడ్కర్ గారి వర్ధంతి కార్య‌క్ర‌మం హిందూపురంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ఆ మహానుభావుడి విగ్రహానికి  వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ దీపికా వేణు రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని , త‌దిత‌రులు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. 
ఈ సందర్భంగా దీపికమ్మ మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అన్నారు 

Back to Top