తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యసభ బరిలో పార్టీ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే గొల్లా బాబురావు, మేడా రఘునాథ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థులు గురువారం సచివాలయంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ బరిలో నిలిచే ముగ్గురు అభ్యర్థుల పేర్లను వైయస్ఆర్‌సీపీ తాజాగా ప్రకటించింది. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి రాజ్యసభ ఎన్నికల్లో పోటీలో నిలవనున్నారు. ఇక, నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరుగనుంది.