వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

పల్నాడు జిల్లా: జంగమహేశ్వరం గ్రామంలో దారుణం జరిగింది. బరితెగించిన టీడీపీ నాయకులు.. వైయ‌స్ఆర్ సీపీ కార్యకర్త  కునిరెడ్డి కృష్ణారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఆయనను టీడీపీ నేతలు గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి చంపారు.

జంగమహేశ్వపురం వైయ‌స్ఆర్‌సీపీలో కృష్ణారెడ్డి యాక్టివ్ గా పనిచేస్తున్నారు. కృష్ణారెడ్డి హత్య నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హంతకుల కోసం మూడు స్పెషల్‌ టీంలను పోలీసులు రంగంలోకి దింపారు. కృష్ణారెడ్డి దారుణ హ‌త్య‌కు గురికావ‌డం ప‌ట్ల తీవ్ర విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు సంతాపం వ్య‌క్తం చేశారు.

Back to Top