ఘ‌నంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు

అమరావ‌తి: రాష్ట్రవ్యాపంగా వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సం ఘనంగా నిర్వహించారు.వైయస్‌ఆర్‌ జిల్లా,అనంతపురం, కర్నూలు,చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం,గుంటూరు,కృష్ణా,పశ్చిమగోదావరి,తూర్పుగోదావరి,విశాఖ జిల్లా,శ్రీకాకుళం,విజయనగరం జిల్లా కేంద్రాలతో పాటు,అన్ని పట్టణ,మండల కేంద్రాల్లో వైయస్‌ఆర్‌సీపీ నేతలు,కార్యకర్తలు పార్టీ జెండాలు ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను, పథకాలను సజీవంగా ఉంచేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లు. గత ఎనిమిదేళ్లుగా ప్రజా జీవితంలో సవాళ్లు, కష్టాలు, నష్టాలకు ఎదురొడ్డి ఈ పార్టీని భుజస్కందాల మీద మోసిన ప్రతి కుటుంబ సభ్యుడికి  వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి  శుభాకాంక్షలు తెలిపారు. 

శ్రీకాకుళం జిల్లాలో..

 పాతపట్నం వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ సమన్వయకర్త రెడ్డి శాంతి జెండా ఆవిష్కరించారు.పలాస వైయస్‌ఆర్‌సీపీ కార్యాయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ సమన్వయకర్త  సీదిరి అప్పల రాజు పార్టీ జెండాను ఎగురవేశారు. శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు,తమ్మినేని సీతారాం, దువ్వాడ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.పాలకొండ కార్గిల్‌ జంక్షన్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావతి జెండా ఆవిష్కరించారు.

విజయనగరం జిల్లాలో

వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం విజయనగరం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో వైయస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించారు.పార్వతి నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త జోగారావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో  పార్టీ జెండా ఆవిష్కరించారు.చినమేరంగి కోటలో వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.

విశాఖ జిల్లా

విశాఖ జిల్లా చోడవరం వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చోడవరం,బుచ్చయ్యపేట,రావికమతం,గోలుకుంట మండల కేంద్రాల్లో పార్టీ జెండా ఆవిష్కరించి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.వైయస్‌ఆర్‌సీపీ తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో మాడుగుల,చీడికాడ,దేవరాపల్లి,కె.కోటపాడు మండల కేంద్రంలో జెండా ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేశారు.విశాఖ సౌత్‌ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ రమణమూర్తి, రాష్ట్ర అధికార ప్రతినిధి,జాన్‌వెస్లీ,వార్డు అధ్యక్షుడు పీతల వాసు,పద్మావతి శేషారత్నం, దేవ, కనకల ఈశ్వర్‌లు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.విశాఖ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవంలో నగర అధ్యక్షులు మళ్ల విజయప్రసాద్,ఇంఛార్జ్‌ కంతేటి సత్యనారాయణ రాజు,పార్లమెంటు అధ్యక్షుడు తైనాల విజయకుమార్, సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ, కేకే రాజు,తిప్పల నాగిరెడ్డి, కొయ్య ప్రసాద్‌ రెడ్డి తదితరులు పార్టీ జెండాను పార్టీ జెండా ఆవిష్కరించారు.

తూర్పుగోదావరిలో

వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనాల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు.ముమ్మిడివరం వైయస్‌ఆర్‌సీపీ కార్యాయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర కార్యదర్శి పెన్మత్స చిట్టిరాజు, అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు  స్వీట్లు పంపిణీ చేశారు.ప్రత్తిపాడు వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ కోఆర్డినేటర్‌ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు,ఏలేశ్వరం,శంఖవరం,రౌతులపూడి మండల కేంద్రాల్లో వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. 

అనంత‌పురం జిల్లాలో..

అనంతపురం జిల్లాలో వాడవాడలా  వైయస్‌ఆర్‌సీపీ  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వం వర్ధిలాలని పార్టీ నేతలు,కార్యకర్తలు నినాదాలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని  ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ పేదల పార్టీ అని, వైయస్‌ జగన్‌ సీఎం అయితే అన్నివర్గాలకు మేలు జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు తెలిపారు. 

 

 

 

Back to Top