విజయవాడ: టీడీపీ నేతలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు మోసం చేశారని చంద్రబాబు చుట్టూ ఉన్నవారంతా దొంగలేనని వైయస్ఆర్సీపీ నేత నార్నే శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.విజయవాడలో మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు పెద్ద మోసగాడని, సొంత తమ్ముడినే మోసం చేశారు. రామ్మూర్తి నాయుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ప్రజలకు చెప్పాలన్నారు.సొంత తమ్ముడిని కూడా పట్టించుకోరు.సొంత తమ్ముడే పట్టించుకోని చంద్రబాబు ప్రజలను పట్టించుకుంటారా అని ప్రశ్నించారు. 12 రోజుల క్రితం చంద్రబాబు చెల్లెలు యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి ఆసుప్రతి పాలయితే..కనీసం పరామర్శ కూడా చేయలేదన్నారు.తెలంగాణలో మన ఆంధ్రప్రజలను ఎవరూ కూడా ఇబ్బందిపెట్టలేదన్నారు.తెలంగాణలో 60 లక్షల మంది మన ఆంధ్రులు ఉన్నారు.పవన్ కల్యాణ్ తెలంగాణలో ఒక మాట,ఆం«ధ్రలో ఒక మాట మాట్లాడతారన్నారు.చంద్రబాబు ఏం చెప్పితే అది మాట్లాడతారని మండిపడ్డారు.
చంద్రబాబు,పవన్‌లు ఒక్కటే..వారిని నమ్మొద్దన్నారు.వైయస్ జగన్మోహన్రెడ్డిని ప్రజలు గెలిపించాలని కోరారు.బయోపిక్ సినిమాల్లో బాలకృష్ణకు చెందిన రెండు సినిమాలు విడుదల అయ్యాయి.దీనికి ఎవరు అడ్డు పడలేదు.లక్ష్మి ఎన్టీఆర్‌ను సినిమాను చంద్రబాబు విడుదల కాకుండా చేశారు.సెన్సార్‌బోర్డు,ఈసీ కూడా అనుమతలు ఇచ్చారు.ఆ సినిమా విడుదల కాకుండా హైకోర్టుకు వెళ్ళి చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. ఈ సినిమా గురించి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.రెండు రోజులు కిత్రం టీవిలో యాత్ర సినిమా ప్రసారం కాకుండా ఆపడానికి టీడీపీ నేతలు శాయశక్తులా ప్రయత్నం చేశారన్నారు.చంద్రబాబు జిమ్మిక్కులు కేసి ఏ మోసం అయినా చేస్తారు.ఎన్నికల్లో చంద్రబాబు పంచే ప్రతి పైసా ఆంధ్ర ప్రజల వద్ద దొంగతనం చేసిన డబ్బులన్నారు.చంద్రబాబు ఎంత డబ్బు ఇస్తే అంతా డిమాండ్ చేసి తీసుకోని వైయస్ జగన్మోహన్రెడ్డికి ఓటు వేయాలని కోరారు.ఎన్టీఆర్ భారత రత్న రావాలంటే..నాలుగు సంవత్సరాలు మోదీతో సహవాసం చేసిన చంద్రబాబుకు ఐదు నిముషాల పని అని,ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకుంది చంద్రబాబే అని అన్నారు.