నేడు వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకం ప్రారంభం

తాడేపల్లి: రైతు క్షేమమే రాష్ట్ర సంక్షేమంగా వైయస్‌ జగన్‌ సర్కార్‌ వడివడిగా అడుగులు వేస్తూ అన్నదాతల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. ‘రైతన్నలకు వడ్డీలేని పంట రుణాలు ఇస్తాం’ అని మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ‘వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ’ పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. అదే విధంగా గత నెలలో వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని కూడా చెల్లించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానం ద్వారా వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో పంట రుణాలు చెల్లించిన 14.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2019 ఖరీఫ్‌ పంటకు సంబంధించి రూ.510 కోట్ల వడ్డీ రాయితీతో పాటు అక్టోబర్‌లో పంట నష్టపోయిన రైతులకు రూ.132.62 కోట్లను అందించనున్నారు. దీంతో రూ.642.94 కోట్లు ఆన్‌లైన్‌ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లోసీఎం వైయస్‌ జగన్‌ జమ చేయనున్నారు. 
 

Back to Top