మాది రైతుల పక్షపాతి ప్రభుత్వం

వైయ‌స్సార్‌ రైతు దినోత్సవ కార్యక్రమంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

రైతుల‌కు సున్నా వడ్డీ పథకంపై   బకాయిలు చెల్లింపు

టీడీపీ హయాంలో వడ్డీలేని రుణాల కోసం రైతులకు బకాయి పడ్డ రూ.1054 కోట్లు  విడుదల

తాడేపల్లి : త‌మ‌ది రైతు ప‌క్ష‌పాత ప్ర‌భుత్వ‌మ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌ర్వంగా చెప్పారు.  గత టీడీపీ ప్రభుత్వం వ్యవసాయ రుణాలకు 1150 రూపాయల కోట్లు వడ్డీ బకాయిలు పెట్టింద‌ని,  57 లక్షల మంది రైతులకు ఆ బకాయిలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. సున్నా వడ్డీ పథకంపై రైతులకు బకాయిలంటిన్నీ పూర్తిగా చెల్లిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.   దివంగత మ‌హానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకొని తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో వైయ‌స్ఆర్‌ రైతు దినోత్సవం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.   ఈ సందర్భంగా టీడీపీ హయాంలో వడ్డీలేని రుణాల కోసం రైతులకు బకాయి పడ్డ 1054 కోట్ల రూపాయలను సీఎం విడుదల చేశారు. ఇప్పటికే వడ్డీలేని రుణాల కోసం 96.50 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కాగా టీడీపీ హయాంలో రైతులకు వడ్డీలేని రుణాలు కింద చెల్లించాల్సి బకాయిల మొత్తం 1150 కోట్ల రూపాయలుగా ఉంది.రాష్ట్రంలోని 5 సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన 54.6 కోట్ల పాత బకాయిలను కూడా సీఎం జగన్‌ విడుదల చేశారు. 

అంబెద్క‌ర్ విగ్ర‌హ నిర్మాణానికి శంకుస్థాప‌న‌
  విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణానికి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం వైయ‌స్‌ జగన్‌ రైతులు, ఇతర అధికారులతో మాట్లాడారు. 

ఆ ఘ‌న‌త వైయ‌స్ఆర్‌దే
రైతులకు మంచి చేసిన నాయకుడు వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.  రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చే ఫైల్‌పై వైఎస్‌ఆర్‌ తొలి సంతకం చేశారు.. రైతుల కరెంట్‌ బకాయిలను కూడా రద్దు చేసిన ఘనత వైయ‌స్ఆర్ దే అన్నారు. ఇప్పుడు ప్రతి రైతుకు రూ.50వేలకుపైగా లబ్ధి పొందేలా మేలు చేస్తున్నామ‌న్నారు. వైయ‌స్‌ అంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, 108 అంబులెన్స్‌లు గుర్తుకొస్తాయి. వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామ‌న్నారు. అక్టోబర్‌లో 2019-20కి సంబంధించిన ఖరీఫ్‌ రుణాల వడ్డీ చెల్లింపులు, మార్చిలో రబీ రుణాల వడ్డీ చెల్లింపు చేస్తామని సీఎం తెలిపారు.

రైతుల కోసం 1907 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు
 రైతుల కోసం 1907 కాల్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు. రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ యంత్రాలు ఉంటాయి.ఆర్‌బీకేల ద్వారా పశువులకు ఉచితంగా కృత్రిమ గర్భదారణ సేవలు అందించనున్నాం. సహకారరంగంలోని చక్కెర రైతులకు గత ప్రభుత్వంలోని 88 కోట్ల రూపాయల బకాయిల్లో ఇప్పటికే 34 కోట్ల రూపాయలు చెల్లించాం.. తాజాగా ఇవాళ 54.6 కోట్ల రూపాయలు విడుదల చేశాం.  రాష్ట్రంలో నాలుగు కొత్త ఫిషింగ్ హార్బర్‌లకు1300 కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకున్నాయి. కేంద్రప్రభుత్వం, నాబార్డ్‌లతో కలిసి రాష్ట్రప్రభుత్వం ఎంవోయూలు చేసుకుంది. రూ.13500 చొప్పున ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం అందించాం. రూ.10,240 కోట్లు రెండు విడతల్లో రైతుభరోసా అందించాం.10,461 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం.విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతులకు అండగా ఉంటాం. ఉద్యానవన పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. పొగాకు రైతులకు కూడా అండగా ఉంటున్నాం. పొగాకును కూడా మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.

గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టేసిన రూ.960 కోట్ల రూపాయను కూడా మన ప్రభుత్వం చెల్లించింది. గత ప్రభుత్వం విత్తన బకాయిలుగా పెట్టిన రూ.384 కోట్ల రూపాయలు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించగలిగింది. గత ప్రభుత్వం 2018–19 ఏడాదికి సంబంధించి రబీ బీమా ప్రీమియం ను రూ.120 కోట్లు చెల్లించి , మన ప్రభుత్వం కంపెనీలతో చర్చలు జరిపి రూ.590 కోట్ల పంటల బీమా డబ్బులు రైతులకు ఇప్పించగలిగాం. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ఇవ్వాలని చెప్పి, ఇప్పటికే 83శాతం ఫీడర్లను మెరుగుపరిచాం. రూ.1700 కోట్ల రూపాయలు కరెంటు సదుపాయాలను మెరుగుపరచడానికి ఇచ్చాం.దేశ చరిత్రలో తొలిసారిగా పంటల బీమా సొమ్మును రైతుల తరఫున కడుతున్న రాష్ట్రం కూడా మనదే. ఆక్వా రైతులకు సరఫరరా చేసేలా రూ.700 కోట్ల సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం మోస్తోందని చెప్పడానికి గర్వపడుతున్నా. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్ల ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేశామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెల్ల‌డించారు.

Back to Top