ముందే వ‌చ్చిన ఉగాది

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నవైయ‌స్ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కార్యక్రమం
 

 అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మైన తెలుగు పండుగ ఉగాది ఒక రోజు ముందే వ‌చ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. 61.03 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.1551.16 కోట్లను విడుదల చేసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఉదయం 7.40 నిమిషాల వరకు రాష్ట్రంలో 35.27 శాతం పెన్షన్ల పంపిణీ జరిగింది. ఇప్పటిదాకా 21.52 లక్షల మంది లబ్ధిదారులకు రూ.545.94 కోట్లను అందజేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 

తాజా వీడియోలు

Back to Top