వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పథకం ప్రారంభం

క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మత్స్యకారులతో మాట్లాడిన సీఎం వైయస్‌ జగన్‌

మత్స్యకారుల ఖాతాల్లో రూ. 10 వేలు జమ

తాడేపల్లి: వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా మత్స్యకారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడి వారి కష్టాలు, నష్టాలు తెలుసుకున్నారు.   వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు రూ.10 వేలు ఆర్థికసాయం అందిస్తున్నామని సీఎం వైయస్‌ జగన్‌ మత్స్యకారులకు తెలిపారు.  క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ బటన్‌ నొక్కగానే మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 10 వేల నగదు జమ అయ్యింది. రాష్ట్రంలో 1,09,231 మంది లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరింది. మునుపెన్నడూ లేని రీతిలో వేట నిషేధ సమయంలో సాయం అందుతుండటంతో మత్స్యకారులు సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.    కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, అధికారులు పాల్గొన్నారు.
 

Back to Top