వైయ‌స్ఆర్ ఎల్‌పీ నేత‌గా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

ఏక‌వాక్య తీర్మాణంతో ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న స‌భ్యులు

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని వైయ‌స్ఆర్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన  పార్టీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని వైయ‌స్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు.  ఈ సమావేశంలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని 151 మంది ఎమ్మెల్యేలు ఏక‌వాక్య తీర్మానంతో వైయ‌స్ జ‌గ‌న్‌ను శాస‌న‌స‌భ‌ పక్ష నేతగా ఎన్నుకున్నారు.బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌తిపాదించ‌గా ఎమ్మెల్యేలు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, పార్థ‌సార‌ధి, ఆదిమూల‌పు సురేష్‌లు బ‌ల‌ప‌రిచారు.   ఈ తీర్మానాన్ని  రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు అంద‌జేయ‌నున్నారు.వైయ‌స్  జగన్‌ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి వర్గం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి శాసనసభాపక్షం తీర్మానం కాపీని అందజేసి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తారు.  
 

తాజా ఫోటోలు

Back to Top