వైయస్‌ఆర్‌ లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్, ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రకటన

లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డుకి రూ.10 లక్షలు, ఎచీవ్‌మెంట్ అవార్డుకి రూ. 5 లక్షలు నగదు బహుమానం

అవార్డులకు ఎంపికైన అభ్య‌ర్థుల వివ‌రాల‌ను వెల్ల‌డించిన రాష్ట్ర ప్ర‌భుత్వ కమ్యూనికేషన్ల స‌ల‌హాదారు జీవీడి కృష్ణ‌మోహ‌న్‌

స‌చివాల‌యం: దివంగత మ‌హానేత వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు వైయ‌స్ఆర్ జీవిత సాఫల్య, వైయ‌స్ఆర్ సాఫల్య పురస్కారాలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర కమ్యూనికేషన్ల సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ అవార్డులను ప్రకటించారు. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు అవార్డుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసింద‌ని చెప్పారు. విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్‌తో పాటు అసామాన్య ప్రతిభ కనబర్చిన సామాన్యలను అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది. వైయ‌స్ఆర్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ.10 లక్షల నగదు, వైయ‌స్ఆర్ కాంస్య ప్రతిమ, మెడల్ (జ్ఞాపిక), శాలువ బహుకరిస్తారు. వైయ‌స్ఆర్‌ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ. 5 లక్షల నగదు, వైయ‌స్ఆర్ కాంస్య ప్రతిమ, మెడల్ (జ్ఞాపిక), శాలువ బహుకరిస్తారు.

రాష్ట్ర కమ్యూనికేషన్ల సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్ అవార్డులను ఆగస్టు 14 లేదా 15 తేదీల్లో అందిస్తామని, లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డుకి రూ.10 లక్షలు నగదు బహుమానం అందిస్తామని తెలిపారు. అదే విధంగా ఎచీవ్‌మెంట్ అవార్డుకి రూ. 5 లక్షలు నగదు బహుమానం అందిస్తామని పేర్కొన్నారు. సినిమా, క్రీడా రంగాలకు ప్రత్యేకంగా అవార్డులున్నాయని, అందుకే ఈ అవార్డుల్లో ఆ రంగాలను చేర్చలేదని ఆయన తెలిపారు. 

వైయ‌స్ఆర్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్ అవార్డుల జాబితా..

సంస్థలు (అన్నింటీకి లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు)
- మత్స్యకార కుటుంబానికి చెందిన ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ ట్రస్ట్ (కాకినాడ)
- సీపీ బ్రౌన్‌ లైబ్రరీ (వైఎస్‌ఆర్‌ జిల్లా)
- సరస్వతి నికేతన్‌ లైబ్రరీ (వేటపాలెం)
- సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌, రూరల్‌ డవలప్‌మెంట్ ట్రస్ట్‌ (అనంతపురం జిల్లా)
- ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌, వైఎస్సార్‌ జిల్లా
- రూరల్‌ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌, అనంతరపురం
- గైతమి రీజినల్ లైబ్రరీ, రాజమండ్రి
- మహారాజా గవర్న్‌మెంట్‌ మ్యూజిక్‌ కాలేజీ, విజయనగరం

రైతులు
- స్వర్గీయ పల్లా వెంకన్న(కడియం నర్సరీల వ్యవస్థపకుడు)

కళాకారులు
- జానపద గేయం- స్వర్గీయ వంగపండు ప్రసాదరావు, విజయనగరం
- రంగస్థలం- పొన్నాల రామసబ్బారెడ్డి, నెల్లూరు
- సురభి నాటకం–  (శ్రీ వినాయక నాట్య మండలి)  సురభి డ్రామా, వైయస్ఆర్‌ జిల్లా
- కూచిపూడి నాట్యం- సిద్ధేంద్ర యోగి కళా క్షేత్రం, కృష్ణా జిల్లా
- లెదర్‌ పప్పెట్రీ–  దాలవాయి చలపతి, అనంతపురం 
- పొందూరు వస్త్రాలు– ఆంధ్ర ఫైన్‌ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం, శ్రీకాకుళం
- బొబ్బిలి వీణ–  శ్రీ బొబ్బిలివీణ కేంద్రం (శ్రీ అచ్చుత నారాయణ),  విజయనగరం

రచయితలు( అందరికీ లైఫ్‌ టైం)
- స్వర్గీయ కాళిపట్నం రామరావు (కారా మాస్టర్‌)- శ్రీకాకుళం
- కత్తి పద్మారావు (అభ్యుదయ సాహిత్యం)- గుంటూరు
- రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి (సాహిత్యం)- వైఎస్సార్‌ జిల్లా
- బండి నారాయణస్వామి(సాహిత్యం)- అనంతపురం
- కేతు విశ్వనాథరెడ్డి(సాహిత్యం)- వైఎస్సార్‌ జిల్లా
- కొనకలూరి ఇనిక్‌ (సాహిత్యం)- గుంటూరు
- లలిత కుమారి (ఓల్గా) (సాహిత్యం)- గుంటూరు

పాత్రికేయులు( అందరికీ లైఫ్‌ టైం) 
- పాలగుమ్మి సాయినాథ్‌- చెన్నై
- ఏబీకే ప్రసాద్- కృష్ణా
- స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వర రావు- గుంటూరు
- స్వర్గీయ షేక్‌ ఖాజా హుస్సేన్‌(దేవీప్రియ) - గుంటూరు
- స్వర్గీయ కె. అమర్‌నాథ్‌- పశ్చిమ గోదావరి
- సురేంద్ర - కార్టూనిస్ట్, కడప
- తెలకపల్లి రవి - కర్నూలు
- ఇమామ్‌ - అనంతపురం

వైయ‌స్ఆర్‌ ఎచీవ్‌మెంట్ అవార్డుల జాబితా..

రైతులు
- మాతోట ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ, శ్రీకాకుళం
- ఎం.సి.రామకృష్ణారెడ్డి, అనంతపురం     
- కొట్యాడ శ్రీనివాసరావు, విజయనగరం
- విఘ్నేశ్వర ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌, కృష్ణా
- ఎం.బలరామిరెడ్డి, వైయస్ఆర్ జిల్లా    
- ఎస్‌.రాఘవేంద్ర, చిత్తూరు
- సెగ్గె కొండల్‌రావు, విశాఖపట్నం
- ఆంధ్ర కశ్మీర్‌ ట్రైబల్‌ ఫార్మింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌,  విశాఖపట్నం
- వల్లూరు రవికుమార్‌, కృష్ణా
- శివ అభిరామరెడ్డి, నెల్లూరు

కళాకారులు
- ధింసా నృత్యం–  కిల్లు జానకమ్మ థింసా నృత్య బృందం, విశాఖపట్నం
- సవర పెయింటింగ్స్‌    – శ్రీ సవర రాజు, శ్రీకాకుళం
- వీధి నాటకం–  మజ్జి శ్రీనివాసరావు, విశాఖపట్నం
- డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌–  ధర్మాడి సత్యం, తూర్పు గోదావరి
- హరికథ–  సర్వారాయ హరికథా పాఠశాల (మహిళ), తూర్పు గోదావరి
- బుర్రకథ–  మిరియాల అప్పారావు, పశ్చిమ గోదావరి
- కొండపల్లి బొమ్మలు – కూరెళ్ల వెంకటాచారి, కృష్ణా
- డప్పు కళాకారుడు–  గోచిపాత గాలేబు, కృష్ణా
- వెంకటగిరి జమదానీ చీరలు–  జి.రమణయ్య, నెల్లూరు
- కలంకారీ పెయింటింగ్స్‌–  శివప్రసాదరెడ్డి, కర్నూలు    
- ఉడ్‌ కార్వింగ్స్‌–  బాలాజీ ఉడ్‌ కార్వింగ్‌ ఆర్జిజాన్స్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌, చిత్తూరు
- నాదస్వరం– డాక్టర్‌ వి.సత్యనారాయణ, చిత్తూరు
- కేలిగ్రఫీ– పూసపాటి పరమేశ్వరరాజు, విజయనగరం

కోవిడ్‌ వారియర్స్‌
- డాక్టర్‌ నీతిచంద్ర– ప్రొఫెసర్‌ పల్మనాలజీ, నెల్లూరు
- డాక్టర్‌ కె.కృష్ణకిషోర్‌– ప్రొఫెసర్‌ ఈఎన్‌టీ, కాకినాడ
- శ్రీమతి లక్ష్మి– స్టాఫ్‌ నర్స్‌, జీజీహెచ్‌. విజయవాడ
- కె.జ్యోతిర్మయి– స్టాఫ్‌ నర్స్‌, అనంతపురం
- తురుబిల్లి తేజస్వి– స్టాఫ్‌ నర్స్‌, విశాఖపట్నం
- ఎం.యోబు– మేల్‌ నర్సింగ్‌, నెల్లూరు
- అమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, గుంటూరు
- ఆర్తి హోమ్స్‌,  వైయస్ఆర్ జిల్లా 
 

Back to Top