కాసేపట్లో ‘వైయస్‌ఆర్‌ కాపు నేస్తం’ ప్రారంభం

తాడేపల్లి: మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌.. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన హామీలను ఇప్పటికే 90 శాతం అమలు చేశారు. కరోనా విపత్తు వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినప్పటికీ.. ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు ముందుకుపడుతున్నాయి. తాజాగా మరో హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. 

కాసేపట్లో ‘వైయస్‌ఆర్‌ కాపు నేస్తం’ పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి లాప్‌టాప్‌ బటన్‌నొక్కి ఈ పథకానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. దారిద్య్రరేఖకు దిగువనున్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అక్కచెల్లెమ్మలకు వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం ద్వారా ఏటా రూ.15 వేల సాయం అందించనున్నారు. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 2.36 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.15 వేల చొప్పున నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలోకి డబ్బు జమ చేయనున్నారు. వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం కోసం సీఎం వైయస్‌ జగన్‌ సర్కార్‌ రూ.354 కోట్లు విడుదల చేసింది. 

Back to Top