వైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం ప్రారంభం

అనంతపురంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభం

వివిధ జిల్లాల్లో ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్యేలు

అనంతపురం: ప్రజా ఆరోగ్యంలో విప్లవాత్మకమైన వైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించగా, అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ప్రారంభించారు.
విద్యార్థుల్లో దృష్టి లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంధత్వ నివారణ లక్ష్యంగా ‘కంటి వెలుగు’ అమలు చేయనుంది. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైయస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ప్రారంభించారు. కృష్ణా జిల్లాలో మంత్రి కొడాలి నాని, చిత్తూరు జిల్లాలో  డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో కలెక్టర్‌ శేషగిరిబాబు, ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్‌ ముత్యాలరాజు ప్రారంభించారు.  తొలి దశలో ఈనెల 10 నుంచి 16 వరకు విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. మలి దశలో దృష్టి లోపాలు ఉన్న విద్యార్థులకు మందులు కళ్లద్దాలు పంపిణీ చేస్తారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top