వైయస్ఆర్‌ కంటి వెలుగు పథకం తొలి దశ ప్రారంభం

పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా ప్రజలందరికీ ఉచితంగా కంటి వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు రూపొందించిన డాక్టర్‌ వైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం తొలి దశను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఏలూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైయస్‌ జగన్‌ వైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్నినాని, తానేటి వనిత, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top