ప్రజల గుండెల్లో వైయస్‌ఆర్‌ స్థానం సుస్థిరం..

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైయస్‌ఆర్‌ జయంతి వేడుకలు

తాడేపల్లి: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానేత వైయస్‌ఆర్‌ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ విగ్రహానికి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే శ్వాసగా, ధ్యాసగా జీవించిన వైయస్‌ఆర్‌.. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. తొలి నుంచి వైయస్‌ఆర్‌తో అడుగులు వేశామని గుర్తుచేశారు. తండ్రి ఆశయ సాధనను లక్ష్యంగా చేసుకొని ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామన్నారు. మహానేత వైయస్‌ఆర్‌ ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top