వైయస్‌ఆర్‌ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయం

వ్యవసాయాన్ని పండగచేసిన రైతు బాంధవుడు వైయస్‌ఆర్‌

వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవిఎస్‌ నాగిరెడ్డి

అమరావతి: రైతు బాంధవుడు వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి  పుట్టిన రోజు సందర్భంగా జూలై 8న ఏపీ  రైతు దినోత్సవంగా ప్రకటించడం రైతులకు గర్వకారణమని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవిఎస్‌ నాగిరెడ్డి అన్నారు.విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌ పాలనలో వ్యవసాయరంగం ఆశాజనకంగా ఉండేదన్నారు. వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయ్యేనాటికి.. సకాలంలో వర్షాలు రాక, పంటలు పండక, పంటలకు గిట్టుబాటు ధరలు లేక.. రాష్ట్రం దుర్భిక్ష పరిస్థితుల్లో ఉండేందన్నారు.  22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఉంటే అందులో 18 బ్యాంకులు దివాళా తీశాయన్నారు. రాష్ట్రంలో 107 లక్షల టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి పడిపోయిందన్నారు. వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల 3 నెలల కాలంలో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసాయని,సకాలంలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల,204 లక్షల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు.

వైద్యనాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు పరిచి సహకార బ్యాంకులను కాపాడారన్నారు. ఎరువుల ధరల నియంత్రణ, రైతు ఉత్పత్తుల ధరలు 70 నుంచి 80 శాతం పెరిగాయన్నారు.  వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతు ఇంట ప్రతి రోజు సంకాంత్రి పండగగా పాలన జరిగిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన ధీశాలి వైయస్‌ఆర్‌ అని కొనియడారు. వైయస్‌ఆర్‌ పుట్టిన రోజైన జూలై 8న ఏపీ రైతుల దినోత్సవంగా ప్రకటించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని వైయస్‌ఆర్‌..హరితాంధ్రప్రదేశ్‌గా చూడాలనుకున్నారని అది ఆయన తనయుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేస్తారని తెలిపారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top