మ‌హానేత ఆశీస్సులు తీసుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

వైయ‌స్ఆర్ ఘాట్ వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్ నివాళులు
 

పులివెందుల: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు,  నిశ్చయ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. ఇడుపుల‌పాయ‌లోని మ‌హానేత వైయ‌స్ఆర్ ఘాట్ వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాళుల‌ర్పించారు. అనంత‌రం అక్క‌డే ఉన్న వైయ‌స్ఆర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. రేపు ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వి ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న వైయ‌స్ జ‌గ‌న్ త‌న తండ్రి స‌మాది వ‌ద్ద ప్రార్థ‌న‌లు చేసి ఆయ‌న ఆశీస్సులు పొందారు. అంత‌కు ముందు పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో వైయ‌స్ జ‌గ‌న్‌ పాల్గొన్నారు. ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొంద‌డంతో చ‌ర్చి పాస్ట‌ర్లు జ‌గ‌న్‌ను ఆశ్వీర‌దించారు. ఇడుపుల‌పాయ చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.  

తాజా ఫోటోలు

Back to Top