డాక్టర్‌ దుట్టాకు వైయ‌స్ఆర్‌ కుటుంబం అరుదైన బహుమతి  

మహానేత ధరించిన దుస్తులను పంపిన విజయమ్మ 

విజ‌య‌వాడ‌:  కృష్ణా జిల్లాలోని హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన వైయ‌స్ఆర్‌ సీపీ పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్‌ దుట్టా రామచంద్రరావును వైయ‌స్ఆర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబం అరుదైన కానుకతో గౌరవించింది. 1976 నుంచి వైయ‌స్ఆర్‌తో దుట్టాకు ఉన్న సాన్నిహిత్యాన్ని మరోమారు గుర్తు చేసుకుంటూ మహానేత సతీమణి వైయ‌స్‌ విజయమ్మ బహుమతిని పంపించారు. వైయ‌స్ఆర్ జ్ఞాపకంగా ఆయన ధరించిన దుస్తులను డాక్టర్‌ దుట్టాకు బహుమతిగా అందజేశారు. వైయ‌స్ఆర్‌ 70వ జయంతి సందర్భంగా ప్రాణమిత్రుడు వేసుకున్న వస్త్రాలను తన చేతితో తడుముతూ దుట్టా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైయ‌స్ఆర్ ఉన్నంతకాలం తమ స్నేహానికి ఎంతో విలువ ఇచ్చారని, ఆయన మరణానంతరం కూడా ఆ కుటుంబం తనకు ఎంతో గౌరవాన్ని ఇస్తోందని దుట్టా గుర్తు చేసుకున్నారు.   

Back to Top