కుప్పం మున్సిపాలిటీ వైయస్‌ఆర్‌ సీపీ కైవసం

15 వార్డుల ఫలితాల్లో 13 గెలుపొందిన వైయస్‌ఆర్‌ సీపీ

చిత్తూరు: కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కుప్పకూలింది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 25 వార్డుల్లో ఇప్పటికే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 13 స్థానాలను కైవసం చేసుకుంది. 15 వార్డుల ఫ‌లితాలు రాగా.. 13 వార్డులలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారిన కుప్పంలో కేవలం రెండు వార్డుల్లోనే టీడీపీ విజయం సాధించింది. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ చేతిలో ఘోర ఓటమిని రుచి చూసిన తెలుగుదేశం పార్టీ.. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కుప్పంలో రెండో రౌండ్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 16వ వార్డు నుంచి 25వ వార్డు ఓట్ల లెక్కింపు ప్రత్యేక అధికారి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతోంది. 

9 మున్సిపాలిటీలు వైయస్‌ఆర్‌ సీపీ సొంతం

రెండో దఫ జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 మున్సిపాలిటీలను వైయస్‌ఆర్‌ సీపీ సొంతం చేసుకుంది. కుప్పం, ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో వైయస్‌ఆర్‌ సీపీ గెలుపొందింది. 

నెల్లూరు..
నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో 7 డివిజన్లలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 14, 27, 28, 33, 39, 41, 53 డివిజన్లలో వైయస్‌ఆర్‌ సీపీ గెలుపొందింది. మరో 32 డివిజన్లలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పూర్తి ఫలితాలు వెలువడాల్సి ఉంది. 
 

తాజా ఫోటోలు

Back to Top