‘జగనన్నే మా భవిష్యత్తు’కు అద్భుతమైన స్పందన

సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వానికి 80 శాతానికి పైగా కుటుంబాలు మద్దతు

1.45 కోట్ల కుటుంబాలను కలిశాం.. కోటి 10 లక్షల మిస్డ్‌ కాల్స్‌ రిసీవ్‌ చేసుకున్నాం

మా నమ్మకం నువ్వే జగనన్న అని ప్రతి కుటుంబం తెలియజేసింది

వైయస్‌ఆర్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ మ‌ర్రి రాజశేఖర్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనకు రాష్ట్రంలోని 80 శాతానికి పైగా కుటుంబాలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ మ‌ర్రి రాజశేఖర్‌ అన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా 7 లక్షల మంది వైయస్‌ జగన్‌ సైన్యం రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలను కలిసి వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారని, కోటి 10 లక్షల కుటుంబాల నుంచి మిస్డ్‌ కాల్స్‌ రిసీవ్‌ చేసుకున్నామని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ఆర్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్, రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, రీజనల్‌ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ మ‌ర్రి రాజశేఖర్, ఎన్‌.టి.ఆర్‌. జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌ పాల్గొన్నారు. 

రాష్ట్రంలోని 80 శాతానికి పైగా కుటుంబాలు మా నమ్మకం నువ్వే జగన్‌ అని నినదిస్తున్నాయని, సీఎం వైయస్‌ జగన్‌ పాలనపై సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తపరిచాయని మ‌ర్రి రాజశేఖర్‌ అన్నారు. రాష్ట్రంలో ఇంత వరకు ఏ పార్టీ చేపట్టనటువంటి గొప్ప కార్యక్రమాన్ని వైయస్‌ఆర్‌ సీపీ చేపట్టిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధితో అమలు చేశారని, సంక్షేమ పాలనను వివరించేందుకు ప్రజల వద్దకు వైయస్‌ఆర్‌ సీపీ ధైర్యంగా వెళ్తుందన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్నికల ముందు చెప్పిన ప్రతిమాట అమలు చేసి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజల దగ్గర నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. 

గృహ సారథులు 1.45 కోట్ల కుటుంబాలను కలిస్తే వారిలో 80 శాతం కుటుంబాలకు పైగా సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వానికి మద్దతు తెలిపాయన్నారు. జగనన్నే మా నమ్మకం అని ప్రతి ఒక్కరూ తెలియజేశారన్నారు. ప్రజా మద్దతు పుస్తకాలను గృహ సారథులకు అందజేసి ప్రజల అభిప్రాయాలను రికార్డులను చేయించామన్నారు. ప్ర‌జ‌లంతా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌కు మ‌ద్ద‌తు తెలిపార‌న్నారు. ప్రజల అంగీకారంతో ఇంటింటికీ మా నమ్మకం నువ్వే జగనన్న స్టిక్కర్లను అంటించడం జరిగిందన్నారు. 

Back to Top