ప్రత్యేక హోదాపై చర్చకు వైయస్‌ఆర్‌ సీపీ నోటీసు

రూల్‌ 267 కింద రాజ్యసభ చైర్మన్‌కు నోటీసు అందజేసిన ఎంపీ విజయసాయిరెడ్డి

ఢిల్లీ: ప్రత్యేక హోదా అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశమని, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో చర్చ జరపాల్సిందేనని సభ చైర్మన్‌కు వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నోటీసులు అందజేశారు. 267 కింద రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడుకు నోటీసులు అందించారు. ప్రత్యేక హోదాపై చర్చ జరపాల్సిందేనని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్‌లోకి దూసుకెళ్లారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించారని, ప్రత్యేక హోదాపై 2014లో కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. ఆమోదించి ఏడేళ్లైనా కేంద్ర కేబినెట్‌ ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదన్నారు. ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top