ప్ర‌ధానితో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు భేటీ

ఢిల్లీ: ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు. పార్ల‌మెంట్‌లోని పీఎం కార్యాల‌యంలో ప్ర‌ధానిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ఎంపీలు సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డిలు బీసీ జనగణన జరపాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. బీసీ జనగణన చేప‌ట్టాల‌ని ప్ర‌ధానిని కోరిన‌ట్టు చెప్పారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నా చట్టసభలో తగిన ప్రాతినిధ్యం లేదన్నారు. ఓబీసీల అభివృద్ధికి, ప్లానింగ్‌ కోసం ఖచ్చితమైన బీసీ జనాభా లెక్కలు అవసరమన్నారు. పార్లమెంట్‌, శాసనసభ, న్యాయ వ్యవస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top