బ‌ద్వేల్ ప్ర‌జ‌లు సుప‌రిపాల‌న‌కు ప‌ట్టంక‌ట్టారు

వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

చిత్తూరు: బద్వేల్‌ ప్రజలు సుపరిపాలనకు పట్టం కట్టారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. 2019 ఎన్నికల్లో వైయ‌స్ జగన్‌పై అభిమానంతో 45 వేల మెజార్టీ అందిస్తే.. రెండున్న‌రేళ్ల‌ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పరిపాలన చూసి 90 వేలకు పైగా మెజార్టీ అందించారన్నారు. అత్య‌ధిక మెజార్టీతో డాక్ట‌ర్ దాసరి సుధ‌ను గెలిపించిన బ‌ద్వేల్ ప్ర‌జ‌ల‌కు ఎమ్మెల్యే రోజా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కుప్పంలో చం‍ద్రబాబు వాగుడు చూశామని.. టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రలు చేసినా ప్రజలు వైయ‌స్ఆర్ సీపీ వైపే మొగ్గు చూపారన్నారు. ఏ సెంటర్‌ అయినా.. ఏమైనా సింగిల్‌ హ్యాండ్‌తో వైయ‌స్ఆర్ సీపీని ప్రజలు గెలిపించారన్నారు. 2024 సార్వ‌త్రిక‌ ఎన్నికలలో వైయ‌స్ఆర్ సీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.

తాజా ఫోటోలు

Back to Top