‘ఛలో విజయవాడ’ సరైన చర్య కాదు

సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమే

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగులకు ఎక్కడా అన్యాయం జరగనివ్వరని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం సరైన చర్య కాదన్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో అంతర్భాగమేనని, అనవసరంగా సమస్యను పెద్దది చేసుకోవద్దన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులు అడగకుండానే సీఎం వైయస్‌ జగన్‌ ఐఆర్‌ ఇచ్చారన్నారని గుర్తుచేశారు. ఉద్యోగులకు ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, చర్చలకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top