వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌కు అరుదైన గౌర‌వం

కర్నూలు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్థర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కరోనా సమయంలో త‌న నియోజకవర్గ ప్ర‌జ‌ల‌కు ఆయన విశేష సేవ‌లు అందించారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, కరోనా బాధితులను పరామర్శించడం, సొంత నిధులతో కూలీలు, కార్మికులకు శానిటైజర్లు, మాస్కు​లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సేవలను గుర్తించిన లండన్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సంస్థ ‘సర్టిఫికెట్‌ ఆఫ్‌ కమిట్‌మెంట్‌’ ఇచ్చేందుకు ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌ను ఎంపిక చేసింది. త్వరలో నందికొట్కూరులో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యేను సన్మానించి సర్టిఫికెట్‌ అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థ‌ర్ మాట్లాడుతూ.. కరోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం శ్రమించారన్నారు. సీఎం సూచనల మేరకు తాను నియోజకవర్గంలో నిత్యం ప్రజల మధ్య ఉంటూ కోవిడ్‌ నివారణకు కృషి చేశానని చెప్పారు. 

తాజా ఫోటోలు

Back to Top