చంద్రబాబు కంచుకోటకు బీటలు

కుప్పంలో కొనసాగుతున్న వైయస్‌ఆర్‌ సీపీ హవా

కుప్పం: చంద్రబాబు చెరలో బంధీగా, దశాబ్దాలుగా మగ్గిపోతున్న కుప్పం నియోజకవర్గానికి విముక్తి లభిస్తోంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలనతో చంద్రబాబు కంచుకోటకు బీటలు పడుతున్నాయి. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ హవా కొనసాగుతుంది. సీఎం వైయస్‌ జగన్‌ ప్రజారంజక పాలనకు కుప్పం ప్రజలు సైతం జై కొట్టారు. ఇటీవల జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల్లో స్వీప్‌ చేసిన వైయస్‌ఆర్‌ సీపీ.. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. కుప్పంలో 12 వార్డుల్లో వైయస్‌ఆర్‌ సీపీ విజయం సాధించింది. 1, 2, 3, 4, 6, 8, 9, 10, 12, 13, 15 వార్డుల్లో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కౌంటింగ్ కొన‌సాగుతోంది. మిగిలిన వార్డుల‌కు సంబంధించిన తుది ఫ‌లితాలు వెలువ‌డాల్సి ఉంది. 

తాజా ఫోటోలు

Back to Top